MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Baleno 2026 : సరికొత్త లుక్‌లో మారుతి బాలెనో.. 2026లోనే ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది..!

Baleno 2026 : సరికొత్త లుక్‌లో మారుతి బాలెనో.. 2026లోనే ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది..!

మారుతి సుజుకి తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ బాలెనోకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురాబోతోంది. 2026లో ఇండియాలో లాంచ్ అయ్యే ఈ కొత్త మోడల్‌లో ఎలాంటి మార్పులు ఉండనున్నాయో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : May 07 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలెనో ఫేస్‌లిఫ్ట్..
Image Credit : NEXA

బాలెనో ఫేస్‌లిఫ్ట్..

మారుతి సుజుకి తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోను సరికొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ ఏడాదే ఇండియాలో లాంచ్ అయ్యే ఈ కారు మరోసారి ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేసేలా కనిపిస్తోంది. ఈ కొత్త మోడల్ కారు టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతోంది… ఇది హ్యుందాయ్ i20కి గట్టి పోటీ ఇవ్వనుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఇండియన్స్ మెచ్చిన మారుతి బాలెనో..
Image Credit : Maruti Suzuki Nexa

ఇండియన్స్ మెచ్చిన మారుతి బాలెనో..

సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2015 లో మారుతి బాలెనో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్ కలిగిన ఈ కారు భారతీయులతో ఎంతగానో ఆకట్టుకుంది… అందుకే అప్పటినుండి ఇప్పటివరకు మారుతి పోర్ట్‌ఫోలియోలో కీలకమైన కారుగా ఉంది. అయితే ఇప్పుడు దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2026 ద్వితీయార్థంలో మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Related Articles

Related image1
maruti baleno 2022:మరింత స్మార్ట్‌గా కొత్త మారుతి బాలెనో.. 40కి పైగా కార్ టెక్ ఫీచర్లు.. టీజర్ వీడియో ఔట్..
Related image2
Baleno Crash Test: సేఫ్టీలో మారుతి సుజుకి బలేనో అదుర్స్.. క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్స్‌తో టాప్
35
మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఔట్ లుక్ అదుర్స్..
Image Credit : X/Jos

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఔట్ లుక్ అదుర్స్..

కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్‌లో ముందువైపు గ్రిల్‌ను మార్చారు. ఇది కారుకు మరింత వెడల్పైన, పవర్‌ఫుల్ లుక్ ఇస్తోంది. దీంతో పాటు కొత్త హెడ్‌లైట్లు, కొత్త బంపర్ కూడా ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ పాత మోడల్ లాగే ఉన్నా, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ దీనికి మరింత స్ట్రాంగ్ లుక్ ఇస్తున్నాయి. వెనుక డిజైన్ దాదాపు ప్రస్తుత మోడల్‌నే పోలి ఉంది.

టెయిల్‌గేట్ డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. కానీ వెనుక బంపర్‌లో చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం ఉంది. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ లోపల కొన్ని అప్‌డేట్స్ ఉండొచ్చు. లాంచ్ సమయంలో మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఈ మార్పులతో బాలెనోకు మరింత షార్ప్ లుక్ వస్తుందని భావిస్తున్నారు.

45
మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్..
Image Credit : Getty

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్..

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ గురించి ప్రస్తుతానికి ఎక్కువ సమాచారం లేదు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం… లోపల లేఅవుట్ పాత మోడల్ లాగే ఉండొచ్చు. కానీ ఉపయోగించే మెటీరియల్స్, సీట్లు, ఇతర ఫీచర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. మరిన్ని ప్రీమియం ఫీచర్లు జోడించి, బాలెనో పాపులారిటీని మారుతి మరింత పెంచే అవకాశం ఉంది.

55
మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు
Image Credit : NEXA

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు

ఈ కొత్త మోడల్‌లో మెరుగైన కనెక్టివిటీ, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణికుల సౌకర్యం కోసం మరిన్ని ఫీచర్లు ఉండొచ్చు. 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటివి కూడా జోడించే అవకాశం ఉంది.

ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ ఇంజిన్‌ను మారుతి కొనసాగించనుంది. ఇది సుమారు 88 హార్స్‌పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు, ఫ్రాంక్స్ కారులో ఉన్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా ఈ కొత్త బాలెనోలో అందించే అవకాశం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Cars : ఏమిటీ... ఈ మారుతి కారుపై డిస్కౌంటే రూ.2.15 లక్షలా..!
Recommended image2
Second Hand Cars: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 6 విషయాలు చెక్ చేయండి.. లేదంటే మోసపోతారు!
Recommended image3
Electric SUVs: పెట్రోల్ టెన్షన్ లేదు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం మొత్తం తిరగొచ్చు ! టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే !
Related Stories
Recommended image1
maruti baleno 2022:మరింత స్మార్ట్‌గా కొత్త మారుతి బాలెనో.. 40కి పైగా కార్ టెక్ ఫీచర్లు.. టీజర్ వీడియో ఔట్..
Recommended image2
Baleno Crash Test: సేఫ్టీలో మారుతి సుజుకి బలేనో అదుర్స్.. క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్స్‌తో టాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved