కొత్త కార్ల సీక్రెట్ స్మశానవాటిక.. చైనా కంపెనీలకు రహస్య కేంద్రంగా పుకార్లు.. అసలు విషయం ఏంటంటే !
చైనా కార్ల తయారీదారులు అత్యధిక సేల్స్ సంఖ్యతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ భారీ అమ్మకాల సంఖ్యతో వస్తోంది. గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అండ్ విక్రయాలలో చైనా కొత్త ప్రపంచ పవర్‌హౌస్‌గా అవతరించింది.
గత కొన్ని సంవత్సరాలుగా, చైనీస్ వాహన తయారీదారులు భారీ విక్రయాల సంఖ్యను నమోదు చేశారు అలాగే ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించారు. అయితే చైనీస్ కార్ కంపెనీల పెరుగుతున్న అమ్మకాల సంఖ్య వెనుక ఉన్న రహస్యాన్ని బహిర్గతం చేసే కొన్ని సమాచారం ఇప్పుడు బయటపడింది.
చైనీస్ కార్ల తయారీదారులు EVలను రిజిస్టర్ చేయడానికి అలాగే అమ్మకాల సంఖ్యలను తప్పుగా మార్చడానికి మోసపూరిత వ్యూహాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందేందుకు, క్యాపిటల్ పెంచుకోవడానికి అండ్ అమ్మకాల చార్టును అధిరోహించడానికి చైనీస్ కార్ బ్రాండ్‌లు తప్పనిసరిగా ఏమి చేసి ఉంటాయో తెలియజేస్తుంది.
వేలాది చైనీస్ ఎలక్ట్రిక్ కార్లు పేరుకుపోయిన చైనీస్ కార్ స్మశానవాటికలో షాకింగ్ వివరాలు వెలువడుతున్నాయి. ఈ స్మశాన వాటికలో మిగిలి ఉన్న కొన్ని మోడళ్లలో గీలీ Kandi K10, Neta V అండ్ BYD e3 వంటి కార్ మోడల్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్లు తూర్పు చైనాలోని షెన్‌జెన్ ప్రావిన్స్ రాజధాని హాంగ్‌జౌ జిల్లాలో పార్క్ చేయబడ్డాయి. కొంతమంది యూట్యూబర్‌లు విక్రయాల సంఖ్యను పెంచడానికి కార్లను నిర్మించిన తర్వాత రహస్యంగా కార్లను డంప్ చేస్తారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందడానికి ఇంకా పెట్టుబడిదారుల నుండి క్యాపిటల్ సేకరించడానికి కంపెనీలు ఈ మోసపూరిత వ్యూహాన్ని ఉపయోగిస్తున్నాయని కూడా ఆరోపించారు.
ఒక వీడియోలో పాడుబడిన కార్లు దుమ్ముతో ఇంకా టైర్లు గడ్డిలో కలిసిపోయి ఉన్నాయి. అయితే ఈ వదిలివేసిన ఎలక్ట్రిక్ కార్ల క్యాబిన్‌లు సరికొత్తగా కనిపిస్తూ కొత్త ప్లాస్టిక్ సీటు కవర్లు, గ్లాస్ ఇప్పటికీ మెరుస్తూ ఉంటాయి. ఈ కార్లన్నింటికీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు కూడా ఉన్నాయి. అంటే అవి ఇప్పటికే రిజిస్టర్డ్ అండ్ విక్రయించిన వాహనాలుగా వెల్లడి అవుతున్నాయి. వీడియోలను విడుదల చేసిన యూట్యూబర్‌లు చైనీస్ EV తయారీదారులు కార్లను రిజిస్టర్ చేస్తున్నారని అండ్ నంబర్‌లను చూపించడానికి అలాగ ప్రభుత్వం నుండి రాయితీలు పొందడానికి వాటిని విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
2019 లో చైనా రోడ్లపై 260 మిలియన్ వాహనాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1.9 మిలియన్ వాహనాలు జాతీయ ఉద్గారాల ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షల్లో విఫలమయ్యాయి అండ్ వాడుకలో లేనివిగా పరిగణించబడ్డాయి అని డైలీ స్టార్ ఇటీవల నివేదించింది. దాంతో 2019లో చైనా ఈ వాహనాలను డెడ్ వెహికల్స్‌గా ప్రకటించి అన్నిటిని వదిలేయాలని నిర్ణయించింది. కాలుష్యాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా, ఉద్గార నియంత్రణ ప్రమాణాలను పాటించడంలో విఫలమైన వాహనాలను డీకమిషన్ చేసి, వాటిని కారు సమాధులుగా మార్చే ప్రక్రియను చైనా ప్రారంభించింది. ఇప్పుడు ఈ వాహనాల శ్మశాన వాటికలో కోట్లాది రూపాయల విలువైన వాహనాలు పేరుకుపోయాయి. వదిలివేసిన వాహనాల్లో ఎక్కువ భాగం రైడ్-హెయిలింగ్ కంపెనీల కార్లు ఉన్నాయి.