MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Automobile
  • Maruti Ignis : రూ. 5 లక్షల్లోనే సూపర్ కారు.. ఈ నెలలో ఏకంగా రూ.57,500 డిస్కౌంట్

Maruti Ignis : రూ. 5 లక్షల్లోనే సూపర్ కారు.. ఈ నెలలో ఏకంగా రూ.57,500 డిస్కౌంట్

Maruti Suzuki Ignis : కేవలం రూ.5 లక్షలకే హ్యుందాయ్ i10, i20, మారుతి స్విప్ట్ వంటి కార్లకు పోటీనిచ్చే సూపర్ కారు వస్తే… అందులోనూ రూ.50-60 వేల వరకు డిస్కౌంట్ లభిస్తే..? 

2 Min read
Author : Arun Kumar P
Published : May 05 2026, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతి ఇగ్నిస్ పై భారీ డిస్కౌంట్
Image Credit : Maruti official

మారుతి ఇగ్నిస్ పై భారీ డిస్కౌంట్

మారుతి సుజుకి ఓ కారుపై భారీ డిస్కౌండ్ ప్రకటించింది... ఈ మే నెలలో ఈ అద్భుత ఆఫర్ ప్రకటించింది. కారు ధర రూ. 5.35 కాగా ఇందులో డిస్కౌంట్ రూ.57,500 వరకు ఉండనుంది. ఇంతకూ ఈ కారు ఏది.. దీని డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ వివరాలు తెలుసుకుందాం.

మారుతి సుజుకి తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్ ఉత్పత్తిని ఇండియాలో ఆపేసింది. అయితే ఈ కారు కొనాలని భావిస్తున్నవారు కంగారు పడాల్సిన పనిలేదు... చెప్పాలంటే ఆనందించాలి. ఎందుకంటే మిగిలిపోయిన స్టాక్‌పై కంపెనీ బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది... ఈ నెలలో (మే, 2026) లో కొనాలనుకునేవారికి అద్భుత అవకాశం. ఈ టైమ్‌లో ఇగ్నిస్ కొంటే కస్టమర్లు రూ. 57,500 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. పూర్తి వివరాల కోసం దగ్గర్లోని డీలర్‌ను సంప్రదించవచ్చు. ఈ ఇగ్నిస్ ఫీచర్లు, ఇంజిన్, ధర వంటి వివరాలు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మారుతి సుజుకి డిజైన్
Image Credit : Maruti official

మారుతి సుజుకి డిజైన్

ఈ కారు డిజైన్ చాలా డిఫరెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. బాక్సీ లుక్, ఎత్తైన వీల్ ఆర్చ్‌లు, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ దీని ప్రత్యేకత. ముందువైపు క్రోమ్ గ్రిల్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs)తో కూడిన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి.

Related Articles

Related image1
Car AC : ఈ మండుటెండల్లో మీ కారు ఏసీ కూలింగ్ పెరగాలా..? ఈ 5 చిట్కాలు పాటించండి
Related image2
EV Car: 1520 కిలోమీట‌ర్ల మైలేజ్‌.. ఎల‌క్ట్రిక్ కార్ల‌లో స‌రికొత్త సంచ‌ల‌నం
35
మారుతి ఇగ్నిస్ ఫీచర్లు
Image Credit : Maruti official

మారుతి ఇగ్నిస్ ఫీచర్లు

కారులోపల ఇంటీరియర్ చాలా కలర్‌ఫుల్‌గా, మనకు నచ్చినట్టు మార్చుకునేలా ఉంటుంది. 7-అంగుళాల 'స్మార్ట్‌ప్లే స్టూడియో' టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా, ఇంకా చాలా మోడ్రన్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.

45
మారుతి ఇగ్నిస్ సేఫ్టీ
Image Credit : Maruti official

మారుతి ఇగ్నిస్ సేఫ్టీ

సేఫ్టీ విషయంలో ఇగ్నిస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేశారు. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటివి స్టాండర్డ్‌గా వస్తాయి. అయితే గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో దీనికి 1-స్టార్ రేటింగ్ మాత్రమే వచ్చింది. లేటెస్ట్ మోడల్‌లో హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్‌ను కూడా చేర్చారు. ఇది ఎత్తైన ప్రదేశాల్లో, ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది.

55
మారుతి ఇగ్నిస్ ఇంజిన్, ధర
Image Credit : Maruti official

మారుతి ఇగ్నిస్ ఇంజిన్, ధర

ఇంజిన్ విషయానికొస్తే, మారుతి నమ్మకమైన 1.2-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించారు. ఇది 82 bhp పవర్‌ను, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. ఈ కారు లీటర్‌కు సుమారు 20.89 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

ఇండియాలో మారుతి సుజుకి ఇగ్నిస్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.35 లక్షల నుంచి రూ. 8.30 లక్షల మధ్య ఉంది. తాజాగా కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్ తో ఈ కారు మరింత తక్కువ ధరకు రానుంది. ఇంకెందుకు ఆలస్యం... ఇగ్నిస్ కారును కొనాలనుకుంటే ఇదే మంచి సమయం.

గమనిక: 

పైన చెప్పిన డిస్కౌంట్లు వివిధ ప్లాట్‌ఫామ్‌ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇచ్చాం. ఈ ఆఫర్లు రాష్ట్రం, నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యత, కారు రంగు, వేరియంట్‌ను బట్టి మారవచ్చు. అంటే మీ నగరంలో లేదా డీలర్‌షిప్ వద్ద ఈ డిస్కౌంట్ ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. కాబట్టి కారు కొనే ముందు, కచ్చితమైన డిస్కౌంట్ వివరాల కోసం మీ దగ్గరలోని స్థానిక డీలర్‌ను సంప్రదించడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
TVS: 145 కిలోమీట‌ర్ల మైలేజ్‌, టైప్‌సీ ఛార్జ‌ర్‌.. టీవీఎస్ నుంచి అదిరిపోయే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్
Recommended image2
Bajaj Pulsar: కొత్త లుక్.. క్రేజీ ఫీచర్లు.. మార్కెట్లోకి సరికొత్త బజాజ్ పల్సర్ 150, 125 గ్రాండ్ ఎంట్రీ
Recommended image3
Ola Scooter Offers : కేవలం రూ.59,999 కే ఓలా స్కూటర్, నెలనెలా అతి తక్కువ EMI.. ఈ ఆఫర్ మిస్ అవ్వొద్దు
Related Stories
Recommended image1
Car AC : ఈ మండుటెండల్లో మీ కారు ఏసీ కూలింగ్ పెరగాలా..? ఈ 5 చిట్కాలు పాటించండి
Recommended image2
EV Car: 1520 కిలోమీట‌ర్ల మైలేజ్‌.. ఎల‌క్ట్రిక్ కార్ల‌లో స‌రికొత్త సంచ‌ల‌నం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved