Maruti Suzuki Ciaz భారత్ కి మారుతి సియాజ్ గుడ్ బై! ఏంటి కథ?
ఒకప్పుడు సెడాన్ విభాగంలో భారతీయులకు ఎంతో ఇష్టమైన మారుతి సుజుకి సియాజ్ ఇకపై ఇండియన్ రోడ్లకు కనిపించదు. మారుతీ కంపెనీ ఈ సెడాన్ మోడల్ అమ్మకాలను నిలిపివేసింది. మార్కెట్లో తక్కువ డిమాండ్, కొత్త మోడళ్ల రాకతో విపరీతమైన పోటీ ఉండటం దీనికి కారణం కావచ్చు.
12

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సియాజ్ సెడాన్ అమ్మకాలు ఆగిపోయాయి. ఈ కారు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మార్కెట్ అవసరాలు, వినియోగదారుల అభిప్రాయం ఆధారంగా మా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటామని మారుతి సుజుకి మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ అన్నారు.
22
మారుతి సియాజ్ ఆగిపోవడానికి అతి ముఖ్యమైన కారణం దాని అమ్మకాలు తగ్గిపోవడమే. గత మార్చిలో కంపెనీ కేవలం 676 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. అమ్మకాలు తగ్గడం దీనికి ముఖ్య కారణం.
Latest Videos