Top Selling Bikes : కేవలం 6 నెలల్లో 21 లక్షల బైక్స్ సేల్.. ఇండియాలో టాప్ బైక్ ఇదే!
2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అంటే కేవలం ఆరు నెలల్లోనే ఓ కంపెనీ బైక్స్ ఏకంగా 21.30 లక్షలకు పైగా అమ్ముడయ్యాాయి. ఈ ఆరు నెలల కాలంలో మన దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ బైక్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం.

ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బైక్ ఇదే..
బైక్ కొనేటప్పుడు ధర, మైలేజ్, మెయింటెనెన్స్, నమ్మకమైన సర్వీస్ లాంటివి జనాలు ఎక్కువగా చూస్తారు. భారతీయ మధ్యతరగతి ప్రజలు సింపుల్ గా ఉండే బైక్స్ ను ఇష్టపడతారు… ఇలాంటివాటినే ఎక్కువగా కొంటుంటారు. మరి ఇండియాలో అత్యధికంగా సేల్ అవుతున్న ఇలాంటి బైక్ ఏదో తెలుసా?
ఇండియన్స్ ఎక్కువగా కొంటున్న బైక్స్ లో హీరో స్ప్లెండర్ ఎప్పటిలాగే టాప్‌లో నిలిచింది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) ఏకంగా 21,30,637 స్ప్లెండర్ బైక్‌లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే టైమ్‌లో 17,80,081 బైక్‌లు సేల్ అయ్యాయి… అంటే ఈ ఏడాది సేల్స్ భారీగా పెరిగాయి. రోజుకు సగటున 11,836 స్ప్లెండర్ బైక్‌లను జనాలు కొన్నారు… దీన్ని బట్టి స్ప్లెండర్కు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. హోండా షైన్ 125, ఎస్పీ 125 మోడల్స్ రెండూ కలిపినా కూడా స్ప్లెండర్ సేల్స్‌ను దాటలేకపోయాయి.
ఈ బైక్స్ కూడా టాప్ లేపుతున్నాయి..
హీరో స్ప్లెండర్ తర్వాత హోండా షైన్ 125,హోండా ఎస్పీ 125 మోడల్స్ కలిపి 9,65,571 యూనిట్లు అమ్ముడయ్యాయి. మూడో స్థానంలో బజాజ్ పల్సర్ నిలిచింది. ఈ ఆరు నెలల్లో పల్సర్ 6,33,015 యూనిట్లు సేల్ అయ్యాయి. కానీ గత ఏడాది ఇదే టైమ్‌లో 6,79,612 యూనిట్లు అమ్ముడవగా, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది.
నాలుగో ప్లేస్‌లో టీవీఎస్ అపాచీ 3,34,347 యూనిట్లతో ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ 2,43,132 యూనిట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. హోండా సీబీ యూనికార్న్ 150 మోడల్ 2,28,721 యూనిట్లు అమ్ముడైంది. టీవీఎస్ రోనిన్ సేల్స్ కూడా పెరిగి 61,829 యూనిట్లకు చేరాయి. ఫ్యామిలీ బైక్స్‌తో పాటు స్పోర్ట్స్ బైక్స్‌కు కూడా ఇండియాలో మంచి డిమాండ్ ఉందని ఈ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఈ బైక్స్ సేల్స్ కూడా పెరిగాయి..
ఈ ఆరు నెలల కాలంలో కొన్ని మోడల్స్ గత ఏడాది కంటే మంచి గ్రోత్ సాధించాయి. ముఖ్యంగా హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ మోడల్ 96,194 యూనిట్లు అమ్ముడైంది. టీవీఎస్ రేడియన్ సేల్స్ గత ఏడాది 71,490 యూనిట్లు ఉండగా, ఇప్పుడు 86,805 యూనిట్లకు పెరిగాయి. హీరో స్ప్లెండర్ గ్రోత్ కూడా ఈ లిస్ట్‌లో హైలైట్ అని చెప్పాలి.
మరోవైపు టీవీఎస్ రోనిన్ సేల్స్ పెరగడం ఆ బైక్‌కు ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. కొత్త మోడల్స్ రావడం, ధరలు, ఆఫర్లు, జనాల ఇష్టాలు ఇలా చాలా కారణాల వల్ల సేల్స్ పెరుగుతాయి. అయితే కేవలం సేల్స్ నంబర్స్ చూసి బైక్ క్వాలిటీని డిసైడ్ చేయలేం. కొనేవాళ్లు తమ అవసరం, ప్రయాణించే దూరం, మెయింటెనెన్స్ ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోవాలి.
సేల్స్ తగ్గిన బైక్స్ ఇవే
అన్ని మోడల్స్ సేల్స్ పెరగలేదు. హీరో ప్యాషన్ బైక్ సేల్స్ గత ఏడాది 1,24,952 యూనిట్లు ఉండగా, ఇప్పుడు 1,15,369 యూనిట్లకు పడిపోయాయి. హోండా షైన్ 100 మోడల్ కూడా గత ఏడాది 1,09,887 యూనిట్లు అమ్ముడవగా, ఇప్పుడు 1,02,833 యూనిట్లకు తగ్గింది. యమహా ఎఫ్‌జెడ్ సేల్స్ 78,798 నుంచి 78,124 యూనిట్లకు పడిపోయాయి. బజాజ్ స్పోర్ట్ మోడల్ కూడా 76,755 నుంచి 72,564 యూనిట్లకు తగ్గింది.
కొన్ని పాపులర్ మోడల్స్‌కు గత ఏడాదితో పోలిస్తే సేల్స్ పరంగా దెబ్బ పడింది. కానీ కేవలం ఆరు నెలల సేల్స్ చూసి ఒక బైక్ ఫ్యూచర్‌ను డిసైడ్ చేయలేం. రాబోయే నెలల్లో కొత్త మోడల్స్, ధరల మార్పులు, మార్కెట్ పోటీ వల్ల సేల్స్ మారే ఛాన్స్ ఉంది.





