పాకిస్థాన్ లో చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే... ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం
ఇండియాలో సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ మైలేజ్ స్థాయిలో పాకిస్థాన్ లో ఓ ఎలక్ట్రిక్ కారు విడుదలయ్యింది. ఇది ఆ దేశంలోనే చవకైన ఈవి కారు అట. దీని ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Inverex Xio EV
భారతదేశంలో చౌక కారు అంటే ఏ రూ.4 లక్షలో లేక రూ.5 లక్షలో ఉంటుంది. కానీ మన పక్కనే ఉన్న పాకిస్థాన్ లో అలాకాదు... అక్కడ బేసిక్ మోడల్ కారు ధర రూ.20, రూ.30 లక్షలు ఉంటుంది. ఇండియాతో పోలిస్తే పాకిస్థాన్ లో కార్లు ధరలు అధికంగా ఉన్నాయి. తాజాగా చైనాకు చెందిన ఓ కంపనీ పాక్ లో ఓ ఎలక్ట్రిక్ కారు అమ్మకాలు చేపట్టింది. ఈ కారే పాకిస్థాన్ లో అత్యంత చవక ఎలక్ట్రిక్ కారు... దీని ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇంత అధిక ధర కారును చవక అంటారేంటని ఆశ్చర్యపోతారు.
India VS Pakistan
పాకిస్థాన్‌లో చౌకైన ఎలక్ట్రిక్ కారు ధర రూ.35 లక్షలు. చైనా కంపెనీ ఇన్వెరెక్స్ ఈ వారం పాకిస్థాన్‌లో చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇన్వెరెక్స్ జియో ఈవి ని విడుదల చేసింది. దీని బేస్ వేరియంట్ ధర అక్షరాలు ముప్పైఐదు లక్షల రూపాయలు. ఇంత ధర కలిగిన ఈ కారును ఫుల్ ఛార్జ్ చేస్తే కేవలం 140 కి.మీ మాత్రమే ప్రయాణించగలరట. ఇండియాలో సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇంతకంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది... అందుకే ఈ కారు ధరకు, మైలేజ్ కు ఎలాంటి పొంతనలేదని నవ్వుకుంటున్నారు.
Alto 800
పాకిస్థాన్‌లో వాహనాల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఆల్టో లాంటి కార్ల ధరలే 13, 14 లక్షల రూపాయల నుండి మొదలవుతాయి... ఇవే కారు ఇండియాలో రూ.3 నుండి 4 లక్షలకే లభిస్తాయి. పాకిస్థాన్ కరెన్సీ విలువ ఇండియన్ కరెన్సీ కంటే తక్కువ కావడమే ఈ తేడాకి కారణం. ఇటీవల ఇండియాతో ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ పరిస్థితి మరింత దిగజారింది.
Pakistan Automobile
పాకిస్థాన్ తాజాగా విడుదలైన ఇన్వెరెక్స్ జియో ఒక కాంపాక్ట్ 4-డోర్ ఎలక్ట్రిక్ కారు. ఈ హ్యాచ్‌బ్యాక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. వేర్వేరు బ్యాటరీ రేంజ్‌లు ఇస్తాయి. బేసిక్ మోడల్ ధర రూ.35 లక్షలు కాగా హైఎండ్ ధర రూ.52 లక్షల వరకు ఉంటుంది. చైనాలో తయారైన ఈ కారుని అంతర్జాతీయంగా లింగ్‌బాక్స్ EV అని పిలుస్తారు. చిన్న, మధ్యస్థ దూర ప్రయాణాల కోసం దీన్ని తయారు చేశారు.
Inverex Xio EV
ఈ ఇన్వెరెక్స్ కారు జియో 140, జియో 220, జియో 320 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు వరుసగా రూ.35 లక్షలు, రూ.42 లక్షలు, రూ.52 లక్షలు. వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో ఈ కారు వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ నుండి 320 కి.మీ వరకు వెళ్తుంది. డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అరగంటలో బ్యాటరీ 30% నుండి 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఈ కారులో బిల్ట్-ఇన్ రాడార్ సిస్టమ్, స్మార్ట్ సేఫ్టీ ఫీచర్స్, ఒక సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్ లాంటివి ఉన్నాయి.
Inverex Xio EV
3,584 mm పొడవు, 1,475 mm వెడల్పు ఉన్న చిన్న కారు ఈ ఇన్వెరెక్స్. 10.1" సెంట్రల్ టచ్‌స్క్రీన్, రివర్స్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్, మాన్యువల్ AC లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్‌లో ABS, EBD, అన్ని వేరియంట్లలో డ్రైవర్-సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఉన్నాయి.