MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.30 వేలు జీతం సంపాదించే వాళ్లు కూడా ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు కొనుక్కోవచ్చు

రూ.30 వేలు జీతం సంపాదించే వాళ్లు కూడా ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు కొనుక్కోవచ్చు

ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం MG కామెట్. చిన్నగా, స్టైలిష్ గా ఉండే ఈ బుల్లి కారు నడపాలని చాలామందికి ఉంటుంది. ఇప్పుడు MG కంపెనీ కామెట్ పై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.లక్ష కట్టి ఈ కారును మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ కారు ధర, ఫీచర్లు, డిస్కౌంట్ల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 17 2025, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సిటీలో తిరగడానికి అనువైన, చవకైన, ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? అయితే మీకు MG కామెట్ EV కరెక్ట్ సెలెక్షన్. భారతదేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్లలో MG కామెట్ EV ఒకటి.  దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.35 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ.7.75 లక్షలు.

25

రూ.లక్ష డౌన్ పేమెంట్ కడితే చాలు..

MG కామెట్ EVను మీరు ఇంటికి తీసుకెళ్లాలంటే జస్ట్ రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించాలి. తర్వాత నెలకు రూ.14,072 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. వడ్డీ రేటు, ఈఎంఐ మొత్తం బ్యాంక్ నిబంధనలు, సిబిల్ స్కోర్, డీలర్ షిప్ విధానంపై ఆధారపడి ఉంటాయి. 

Related Articles

Related image1
ఏంటీ.. ఎలక్ట్రిక్ బైక్‌కి కూడా గేర్స్ ఉంటాయా? ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అయిన ఎరా మేటర్ కొత్త ఇ-బైక్
Related image2
స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్స్ తో హోండా ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్ విడుదల
35

రూ.30,000 జీతం ఉన్నవారు కూడా కొనొచ్చు..

మీరు నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తారా? అయితే మీరు కేవలం రూ.లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారు ఇంటికి తీసుకెళ్లొచ్చు. మిగిలిన మొత్తానికి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు 9% వడ్డీ రేటుతో లోన్ తీసుకుని నెలకు ఈఎంఐల రూపంలో కట్టుకుంటే సరిపోతుంది. ఈఎంఐ నెలకు రూ.14,072 వరకు పడుతుంది.

45

కామెట్ EV ప్రత్యేకతలివే..

కామెట్ కారులో 17.3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఇది 41.42 bhp పవర్, 110 Nm టార్క్ కలిగిన మోటార్ తో పనిచేస్తుంది. ARAI సర్టిఫికేట్ ప్రకారం ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే కామెట్ కారు 230 కి.మీ. వరకు వెళ్తుంది. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.

55

ఛార్జింగ్ టైమ్ ఎంతంటే..

3.3 kW AC ఛార్జర్‌ని ఉపయోగించి 0-100% ఛార్జ్ చేయడానికి 7 గంటల సమయం పడుతుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ABS + EBD, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Related Stories
Recommended image1
ఏంటీ.. ఎలక్ట్రిక్ బైక్‌కి కూడా గేర్స్ ఉంటాయా? ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అయిన ఎరా మేటర్ కొత్త ఇ-బైక్
Recommended image2
స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్స్ తో హోండా ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్ విడుదల
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved