MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Automobile
  • Best CNG Cars : ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు సరిగ్గా సెట్టయ్యే టాప్ 7 డ్యూయల్ సిఎన్జీ కార్లు

Best CNG Cars : ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు సరిగ్గా సెట్టయ్యే టాప్ 7 డ్యూయల్ సిఎన్జీ కార్లు

సింగిల్ సిలిండర్ సిఎన్జీ కారు కంటే డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కారు ఎందుకు బెస్ట్? ఇండియాలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్న డ్యూయల్ సిలిండర్ కారు మోడల్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 23 2026, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సింగిల్ సిలిండర్ కంటే డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కార్లు ఎందుకు బెస్ట్?
Image Credit : Gemini AI

సింగిల్ సిలిండర్ కంటే డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కార్లు ఎందుకు బెస్ట్?

Dual Cylinder CNG Cars : రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి… భవిష్యత్ లో కూడా వీటి ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి తప్పే తగ్గే ఛాన్సెస్ లేవు. అందుకే చాలామంది తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసుకుంటున్నారు... అందుకే సిఎన్జి వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చు, ఎక్కువ మైలేజ్ కారణంగా CNG కార్లకు భారత మార్కెట్లో డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది.

అయితే సిఎన్జీ కార్లతో సమస్య ఏంటంటే బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది... కాబట్టి ప్యామిలీతో ప్రయాణ సమయం లగేజీ పెట్టుకునేందుకు ఎక్కువ స్పేస్ ఉండదు. దీనికి పరిష్కారంగా పలు కంపెనీలు డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కార్లను తీసుకువచ్చాయి. ఒకే పెద్ద సిలిండర్‌కు బదులుగా రెండు చిన్న సిలిండర్లను అమర్చడం వల్ల లగేజీ పెట్టుకోవడానికి ఎక్కువ బూట్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. మైలేజీలో కూడా ఎలాంటి తేడా ఉండదు. అందుకే ఈ డ్యూయల్ సిలిండర్ CNG కార్లకు డిమాండ్ పెరుగుతోంది.

ప్రస్తుతం ఇండియాలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కార్ల తయారీపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ధరల్లో, ఎక్కువ మైలేజ్, బూట్ స్పేస్ కలిగిన చిన్న కార్లను తీసుకువస్తున్నాయి. ఇలాంటి టాప్ 7 బడ్జెట్ ప్రెండ్లీ డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కార్లు ఇవే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టాటాలో టాప్ డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కార్లు ఇవే
Image Credit : Tatamotors

టాటాలో టాప్ డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కార్లు ఇవే

టాటా టియాగో సిఎన్జి (TATA Tiago CNG)

టాటా టియాలో డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కారు ప్రారంభ ధర రూ. 5.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారులో 1.2 లీటర్ ఇంజిన్, మ్యాన్యువల్-AMT గేర్‌బాక్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ESC, డిజిటల్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మంచి లుక్, సూపర్ ఇంటీరియర్ తో పాటు అద్భుతమైన ఫీచర్లు, భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుంది ఈ టాటా టియాగో.

టాటా పంచ్ సిఎన్జి (TATA Punch CNG)

ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన కారు టాటా పంచ్. ఇందులోనూ ఇప్పుడు డ్యూయల్ సిలిండర్ సిఎన్జి కార్ల హవా నడుస్తోంది. ఈ కారు ధర రూ. 6.79 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది కిలో సిఎన్జీకి 26.99 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇందులో 360-డిగ్రీ కెమెరాతో పాటు అనేక సదుపాయాలు ఉంటాయి. బడ్జెట్ ధరలో డ్యూయల్ సిఎన్జీ కారు కావాలనుకునేవారికి ఇది పర్పెక్ట్ ఎంపిక.

టాటా టిగోర్ సిఎన్జి (TATA Tigor CNG)

టాటాలోనే మరో డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కారు అందుబాటులో ఉంది.... అదే టాటా టిగోర్. ఈ కారు ధర రూ. 7.21 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ESP,  హిల్ హోల్డ్ కంట్రోల్ దీని ప్రత్యేకతలు.

టాటా ఆల్ట్రోజ్ సిఎన్జి (TATA Altroz CNG)

ఈ కారు ధర రూ. 7.29 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లున్నాయి.

33
హ్యుందాయ్ లో టాప్ డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కార్లు ఇవే
Image Credit : HYUNDAI

హ్యుందాయ్ లో టాప్ డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కార్లు ఇవే

గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్జి (Grand i10 Nios CNG)

హ్యుందాయ్ ఐ10 నియోస్ కూడా డ్యూయల్ సిలిండర్ సిఎన్జీతో వస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 7.26 లక్షలుగా ఉంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్, టైప్-సి యూఎస్బి ఛార్జర్, కొత్త ఇంటీరియర్ డిజైన్ వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ ఆరా సిఎన్జి (Hyunai Aura CNG)

బడ్జెట్ ప్రెండ్లీ డ్యూయల్ సిలిండర్ సిఎన్జీ కార్లలో హ్యుందాయ్ ఆరా కూడా ఉంటుంది. దీని ధర రూ. 7.81 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో 1.2 లీటర్ ఇంజిన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ సిఎన్జి (Hyudai Exter CNG)

హ్యుందాయ్ లోనే మరో పాపులర్ డ్యూయల్ సిలిండర్ సిఎన్జి కారు ఈ ఎక్స్‌టర్. దీని ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు. ఈ కారు సుమారు 27.1 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు దీని సొంతం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Suzuki : 35 కి.మీ మైలేజ్ తో నయా టాల్ బాయ్ కారు రెడీ.. కేవలం రూ.5 లక్షలకే వస్తుందా..!
Recommended image2
Top 3 Tata Cars : అమ్మకాల్లో అదరగొడుతున్న టాప్ 3 టాటా మోడల్స్ ఇవే
Recommended image3
Top 5 Scooters : ఇండియన్స్ ఎగబడి కొంటున్న టాప్ 5 స్కూటర్లు ఇవే
Related Stories
Recommended image1
CNG Cars : రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే 35 కి.మీ మైలేజ్ కార్లు... ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు
Recommended image2
Safe Cars Under 5 Lakh: మైలేజ్, సేఫ్టీ, CNG ఆప్షన్ తో రూ.5 లక్షల్లో ఇంత మంచి కారు దొరుకుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved