MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • CNG Cars : రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే 35 కి.మీ మైలేజ్ కార్లు... ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు

CNG Cars : రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే 35 కి.మీ మైలేజ్ కార్లు... ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు

మీరు పది లక్షల రూపాయల బడ్జెట్‌లో మంచి సీఎన్‌జీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మార్కెట్లో ఉన్న బెస్ట్ మోడల్స్, వాటి ధర, మైలేజ్, కీలక ఫీచర్ల గురించి ఇక్కడ వివరంగా చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 03 2026, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ బడ్జెట్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు...
Image Credit : meta ai

తక్కువ బడ్జెట్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు...

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితేే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సిఎన్జి కారు కొనడం మంచి ఆప్షన్. అయితే దీని మెయింటెనెన్స్ తక్కువే అయినా ధర ఎక్కువ అనే భావన చాలామందిలో ఉంది. కానీ కేవలం రూ.10 లక్షల లోపు ధరలోనే మంచి సిఎన్జి కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మారుతి సెలెరియో, టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ వంటి కార్లు ఈ లిస్టులో ఉన్నాయి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Maruti Celerio CNG (మారుతి సెలెరియో సిఎన్జీ)
Image Credit : stockPhoto

Maruti Celerio CNG (మారుతి సెలెరియో సిఎన్జీ)

సిఎన్జి కార్ల మైలేజ్ విషయంలో మారుతి సెలెరియో కింగ్ లాంటిది. ఇది ఒక కిలో సీఎన్‌జీకి 34.43 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇండియాలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ కార్లలో ఇదే టాప్. దీనిలోని 998 సీసీ 3-సిలిండర్ ఇంజిన్, సీఎన్‌జీ మోడ్‌లో 55.92 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ సేఫ్టీ లాక్స్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.5.97 లక్షలు మాత్రమే.

35
TATA Punch CNG (టాటా పంచ్ సీఎన్‌జీ)
Image Credit : TATA MOTORS

TATA Punch CNG (టాటా పంచ్ సీఎన్‌జీ)

టాటా పంచ్ సీఎన్‌జీ కారు ఒక కిలోకు 26.99 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఈ లిస్టులో 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ పొందిన ఏకైక కారు ఇదే. ఇందులో ట్విన్-సిలిండర్ టెక్నాలజీ ఉండటం వల్ల సీఎన్‌జీ ట్యాంక్ ఉన్నప్పటికీ 210 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. దీని టాప్ వేరియంట్లలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.6.74 లక్షలు.

45
Maruti Fronx CNG (మారుతి ఫ్రాంక్స్ సీఎన్‌జీ)
Image Credit : Asianet News

Maruti Fronx CNG (మారుతి ఫ్రాంక్స్ సీఎన్‌జీ)

మారుతి ఫ్రాంక్స్ సీఎన్‌జీ కారులో 1197 సీసీ, 4-సిలిండర్ K-సిరీస్ ఇంజిన్ ఉంది. ఇది 76.43 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తూ, ఒక కిలోకు 28.51 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ ఏసీ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా వస్తున్నాయి. ఈ లిస్టులోనే ఇది ఒక ప్రీమియం సీఎన్‌జీ కారు అని చెప్పొచ్చు. దీని ప్రారంభ ధర రూ.7.86 లక్షలు.
55
Hyundai Aura CNG (హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ)
Image Credit : Asianet News

Hyundai Aura CNG (హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ)

హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీలో 1197 సీసీ, 4-సిలిండర్ బయో-ఫ్యూయల్ ఇంజిన్ ఉంది. ఇది ఒక కిలోకు 28.4 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో 68 bhp పవర్‌ను అందిస్తుంది. కమర్షియల్ మోడల్ మినహా అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, రియర్ ఏసీ వెంట్స్, TPMS, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లతో, ఈ లిస్టులో ఇది అత్యంత సౌకర్యవంతమైన సెడాన్ కారు. దీని ప్రారంభ ధర రూ.6.90 లక్షలు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Car Tips: కారు వేగంగా వెళ్తున్నప్పుడు రివర్స్ గేర్ వేస్తే ఏమవుతుందో తెలుసా.?
Recommended image2
Family Bikes: పేరెంట్స్ తో ప్రయాణానికి బెస్ట్ 5 బైక్స్.. కొనేముందు ఇవి కచ్చితంగా చూడండి
Recommended image3
Second Hand Car: కారు తక్కువ ధరకు వస్తోందని కొనేస్తున్నారా? ఇవి చెక్ చేయకపోతే నష్టం తప్పదు!
Related Stories
Recommended image1
తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. భారత్‌లో అత్యంత చౌకైన 5 CNG కార్లు ఇవే
Recommended image2
CNG vs Flex Fuel : తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజ్.. సిఎన్జీ, ప్లెక్స్ ఫ్యూయల్ కార్లలో ఏది బెస్ట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved