MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • Car AC Tips : ఈ మండుటెండల్లో కారు ఏసీ ఎలా వాడాలో తెలుసా..? తప్పుగా వాడితే తాటతీస్తుంది

Car AC Tips : ఈ మండుటెండల్లో కారు ఏసీ ఎలా వాడాలో తెలుసా..? తప్పుగా వాడితే తాటతీస్తుంది

ఎండాకాలంలో కారులో ఏసి ఎలా వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం బాగుండాలన్నా, ఏసి పనితీరు మెరుగ్గా ఉండాలన్నా కొన్ని సింపుల్ టిప్స్ పాటించాల్సిందే. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 23 2026, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కారులో ఏసీ ఎలా వాడాలి..?
Image Credit : Gemini AI

కారులో ఏసీ ఎలా వాడాలి..?

ఎండలో పార్క్ చేసిన కారు నిమిషాల్లోనే నిప్పుల కొలిమిలా మారిపోతుంది. లోపల కూర్చోవడం కూడా నరకంగా ఉంటుంది. వేసవికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఎండలో తిరిగొచ్చి కారులో కూర్చోగానే వేడికి ఉక్కిరిబిక్కిరి అయిపోతారు.. అందుకే డోర్ తీయగానే ఏసీ ఆన్ చేసేస్తారు… క్యాబిన్‌ను త్వరగా చల్లబరచాలని చూస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. విపరీతమైన ఎండలో, కారు లోపలి వేడి బయటికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో నేరుగా ఏసీ ఆన్ చేయడం ఆరోగ్యానికి, కారుకు కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముందుగా కారులో గాలి బయటకు పోనివ్వండి
Image Credit : X@AarizRizvi

ముందుగా కారులో గాలి బయటకు పోనివ్వండి

ఎక్కువసేపు ఎండలో పార్క్ చేసినప్పుడు కారు డాష్‌బోర్డ్, సీట్లు, ఇతర ప్లాస్టిక్ భాగాలు బాగా వేడెక్కుతాయి. ఈ వేడికి క్యాబిన్‌లో చిక్కుకుపోయిన గాలి మరింత వేడిగా మారుతుంది… అలాగే కొన్నిరకాల విష వాయువులు విడుదల అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వెంటిలేషన్ లేకుండా ఏసీ ఆన్ చేస్తే, ఆ వేడి గాలే కాసేపటి వరకు క్యాబిన్‌లో తిరుగుతూ ఉండి, మనల్ని మరింత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కారు ఎక్కగానే ఏసీ ఆన్ చేయకుండా వేడిగాలిని బయటకు పంపించాలి.

నిపుణుల ప్రకారం... కారు ఎక్కిన తర్వాత చేయాల్సిన మొదటి పని అన్ని డోర్లు, కిటికీలను కొన్ని సెకన్ల పాటు తెరిచి ఉంచడం. దీనివల్ల లోపల ఉన్న గాలి సులభంగా బయటకు వెళ్లిపోయి, క్యాబిన్ ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వస్తుంది. ఆ తర్వాత కారు స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేస్తే, అది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Related Articles

Related image1
Car AC : మ్యానువల్ ఏసీ vs ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ .. మీ కారుకు ఏది బెస్ట్?
Related image2
AC Gas : టెక్నీషియన్ అవసరం లేదు.. ఏసీలో గ్యాస్ ఉందో, లేదో మీరే చెక్ చేసుకొండి, చాలా సింపుల్
35
ఏసీని ఇలా స్టార్ట్ చేయండి..
Image Credit : gemini AI

ఏసీని ఇలా స్టార్ట్ చేయండి..

కారు ఎక్కగానే మొదట ఏసీని తక్కువ స్పీడ్‌లో నడపడం మంచిది. క్యాబిన్ కాస్త చల్లబడ్డాక, అప్పుడు నెమ్మదిగా కూలింగ్ పెంచుకోవచ్చు. దీనివల్ల ఏసీ సిస్టమ్‌పై ఎక్కువ భారం పడకుండా ఉంటుంది, అది మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాగే మన శరీరం కూడా క్రమక్రమంగా చల్లబడుతుంది.. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవు. 

45
హఠాత్తుగా చల్లదనం కూడా ప్రమాదమే...
Image Credit : Gemini AI

హఠాత్తుగా చల్లదనం కూడా ప్రమాదమే...

విపరీతమైన వేడి నుంచి నేరుగా చల్లటి వాతావరణంలోకి మారడం శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. చాలామందికి తలనొప్పి, అలసట, కళ్లు తిరగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఎదురవ్వొచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, సున్నితమైన ఆరోగ్యం ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. అందుకే బయట ఎండలో తిరిగివచ్చాక ఒకేసారి ఏసీ ఆన్ చేసుకోకూడదు.

55
ఈ విషయాలు కూడా గుర్తుంచుకోండి
Image Credit : Hyundai

ఈ విషయాలు కూడా గుర్తుంచుకోండి

వేసవిలో వీలైనంత వరకు మీ కారును నీడలో పార్క్ చేయండి. క్యాబిన్ వేడిని తగ్గించడానికి విండ్‌షీల్డ్ సన్‌షేడ్ వాడండి. ఏసీ ఫిల్టర్, కూలింగ్ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం కూడా చాలా ముఖ్యం. సరైన మెయింటెనెన్స్ మంచి కూలింగ్‌ను ఇవ్వడమే కాకుండా, మంచి మైలేజీని కూడా అందిస్తుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో మీ కారును వేగంగా చల్లబరుచుకోవచ్చు. అలాగే మీ ఆరోగ్యానికి, కారుకు అనవసరమైన నష్టం జరగకుండా చూసుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kia Car Offers : కియా కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image2
Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి
Recommended image3
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Related Stories
Recommended image1
Car AC : మ్యానువల్ ఏసీ vs ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ .. మీ కారుకు ఏది బెస్ట్?
Recommended image2
AC Gas : టెక్నీషియన్ అవసరం లేదు.. ఏసీలో గ్యాస్ ఉందో, లేదో మీరే చెక్ చేసుకొండి, చాలా సింపుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved