Zodiac Signs: ఈ రాశుల వారు సింగిల్ గా ఉండటానికే ఇష్టపడతారు..!
అందరూ తమను ప్రేమించాలని, వారు తమతోనే ఉండాలి అని అనుకుంటారు. కానీ, దీనికి పూర్తిగా భిన్నంగా ఆలోచించేవారు కూడా చాలా మంది ఉన్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రేమ ఒక తీయనైన బంధం. ప్రతి ఒక్కరూ తమ లైఫ్ లో ఎదుటి వారి నుంచి ఎంతో కొంత ప్రేమను కోరుకుంటారు. అందరూ తమను ప్రేమించాలని, వారు తమతోనే ఉండాలి అని అనుకుంటారు. కానీ, దీనికి పూర్తిగా భిన్నంగా ఆలోచించేవారు కూడా చాలా మంది ఉన్నారు.తమ పక్కన ఎవరూ లేకుండా..ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరూ లేకపోతే స్వేచ్ఛగా బతకొచ్చు అనే భావన వీరిలో ఉంటుంది. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం సహజంగా ఒంటరితనం కోరుకునే రాశులేంటో చూద్దాం...
telugu astrology
1.సింహ రాశి.. సింహ రాశివారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. సింగిల్ గా ఉంటూ కూడా లైఫ్ ఎంజాయ్ చేయగలరు. వారి వ్యక్తిత్వాన్ని వారే నిర్మించుకుంటారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళతారు. ఈ రాశివారిని ఎవరైనా ప్రేమించి లైఫ్ లోకి రావాలని ప్రయత్నిస్తే.. రానిస్తారు. కానీ, అలా అని పూర్తిగా వారికి బంధీ అయిపోరు. ఎవరి మీదా ఆధారపడటం వీరికి నచ్చదు. ఒంటరిగా ఉండటం వారు బలహీనతగా కాక, శక్తిగా భావిస్తారు. రిలేషన్ లో కూడా వారు తమదైన స్పేస్ ఉండాలని కోరుకుంటారు.
telugu astrology
తుల రాశి (Libra): తుల రాశి వారికి అందం, సమతుల్యత చాలా ముఖ్యం. వారు సహజంగా నచ్చిన వ్యక్తులతోనే మమేకమవుతారు. అయితే, తరచూ ఆంతర్యంగా వీరు తాము తీసుకునే నిర్ణయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. సహజంగా ఒంటరిగా ఉండే సమయంలో వారి ఆత్మపరిశీలన పెరుగుతుంది. బంధం కావాలి కానీ అది భారం కాకూడదనేది వారి భావన.
telugu astrology
ధనస్సు రాశి (Sagittarius): స్వేచ్ఛా ప్రియులు, సాహసయాత్రికులు
ధనస్సు రాశి వారు స్వేచ్ఛను అత్యంత విలువగా భావిస్తారు. ప్రేమలో కూడా వారు ఆ స్వేచ్ఛ కోల్పోవాలనుకోరు. ప్రయాణాలు, అన్వేషణ, కొత్త విషయాల మీద ఆసక్తితో, ఒంటరిగా ఉన్నా తమను తాము బాగా ఆస్వాదిస్తారు. బంధం వారికి మానసికంగా ఖచ్చితంగా అన్వయమవుతుందా? అని వారు ముందుగా ఆలోచిస్తారు.
telugu astrology
కుంభ రాశి (Aquarius):
కుంభ రాశి వారు ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారు భావోద్వేగాల కంటే ఆలోచనలతో బంధాలను చూసే తత్వం కలిగి ఉంటారు. ప్రేమను తేలికగా తీసుకోరు కానీ, వారి వ్యక్తిగత స్పేస్‌ను మరీ ఎక్కువగా విలువిస్తారు. స్నేహాలు, సంబంధాలు ఉంటాయి కానీ వారు ఏ సంబంధం నుంచైనా కొంత దూరాన్ని మెయింటేన్ చేయడాన్ని ప్రిఫర్ చేస్తారు.
ఫైనల్ గా, ఈ రాశుల వారు ప్రేమకు వ్యతిరేకులు కాదు. కానీ తమ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వభావాన్ని పరిరక్షించుకోవడం వారికి అత్యంత ముఖ్యం. వారు ఒంటరిగా ఉన్నా శాంతిగా, సంతృప్తిగా జీవించగలరు. నిజమైన సంబంధం అంటే తమను ఒత్తిడికి గురిచేయకుండా ఉండటమేనని భావిస్తారు.