- Home
- Astrology
- Zodiac sign: డిసెంబర్ 7 నుంచి ఈ 5 రాశుల వారికి లక్కే లక్కు.. ధనుస్సులోకి కుజుడు ప్రవేశం
Zodiac sign: డిసెంబర్ 7 నుంచి ఈ 5 రాశుల వారికి లక్కే లక్కు.. ధనుస్సులోకి కుజుడు ప్రవేశం
Zodiac sign: డిసెంబర్ 7న కుజుడు ధనుస్సు రాశిలోకి అడుగుపెడుతున్నాడు. వృశ్చికం నుంచి ధనుస్సులోకి మారుతున్న క్షణం అనేక రాశులకు కొత్త అవకాశాలను తెరుస్తుందని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం.కొన్ని రాశుల వారికి ఈ మార్పు ప్రత్యేకమైన ఫలితాలను అందించనుంది.

మేషం – ధనలాభాలు, నెరవేరనున్న కోరికలు
కుజ ప్రభావం మేష రాశి 9వ స్థానాన్ని తాకుతుంది. ఈ మార్పు కారణంగా అనుకున్న ఆస్తి, వాహన కొనుగోలు అవకాశాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది, వ్యాపారానికి కొత్త దారులు తెరుచుకుంటాయి. కుటుంబ అవసరాలు తీర్చేందుకు సరిపోయే ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. హోటలింగ్, వసతి రంగంలో పనిచేసేవారికి పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి రుణాలు, ఆర్థిక సహాయం లభించే అవకాశం కూడా ఉంది.
మిథునం – అదృష్టం తలుపు తడుతోంది
ఈ గోచారం మిథున రాశి వారి ధనస్థానాన్ని చురుగ్గా మార్చుతుంది. దీని ఫలితంగా పెండింగ్ పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగ స్థాయిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు కుటుంబంతో మళ్లీ కలిసే సూచనలు ఉన్నాయి. చదువు కోసం విదేశాలకు వెళ్లాలని చూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం పొందే అవకాశం ఉంది.
సింహం – శుభకార్యాలు, వ్యాపారంలో పెరుగుదల
కుజుడు సింహ రాశి 5వ స్థానాన్ని చైతన్యవంతం చేస్తాడు. దీంతో ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. తోబుట్టువుల కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ఆలోచనలకు అనుకూల వాతావరణం ఉంది. వస్త్ర వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగాలకు ఊపందుతుంది. పెట్టుబడులపై మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం.
ధనుస్సు – ఆనందం, ఆరోగ్యం, కెరీర్ పురోగతి
కుజ ప్రవేశం నేరుగా ఈ రాశి 1వ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. పనిలో మీ అభిప్రాయాలకు గౌరవం లభిస్తుంది. కొత్త అవకాశాలు, ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో విస్తరణకు మంచి సమయం. దాంపత్య జీవితంలో సంతోషకరమై వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది.
మీనం – కష్టానికి గుర్తింపు, పదోన్నతులు
కుజ ప్రభావం కార్మిక స్థానాన్ని బలపరుస్తుంది. దీంతో కార్యాలయంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత పదవి, బహుమతి అవకాశం ఉంది. ఒప్పందాలు సులభంగా పూర్తికావడం, కొలిగ్స్ సపోర్ట్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు శుభవార్త వింటారు. అయితే ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక భద్రత పెరుగుతుంది. మీ ప్రతిభ వెలుగులోకి వచ్చే సమయం ఇది.
గమనిక: పైన తెలిపిన వివరాలను పలువురు జ్యోతిష్య పండితులు తెలిపిన అంశాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

