Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 6.12.2025 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు శ్రమతో పూర్తవుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటాపట్టింపులు తప్పవు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. అవసరానికి ఇతురుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి.
మిథున రాశి ఫలాలు
నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది.
కర్కాటక రాశి ఫలాలు
వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
సింహ రాశి ఫలాలు
అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
కన్య రాశి ఫలాలు
బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సంతాన ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది.
తుల రాశి ఫలాలు
ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వల్ల మానసిక బాధలు తప్పవు.
ధనుస్సు రాశి ఫలాలు
నిరుద్యోగులకు అధిక కష్టం మీద అవకాశాలు అందుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.
మకర రాశి ఫలాలు
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలిసివస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభ రాశి ఫలాలు
వ్యాపారాలలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది.
మీన రాశి ఫలాలు
ఉద్యోగాలలో మంచి పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

