- Home
- Astrology
- Zodiac Signs: ఈ రాశులవారితో జాగ్రత్తగా ఉండండి.. మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు..!
Zodiac Signs: ఈ రాశులవారితో జాగ్రత్తగా ఉండండి.. మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు..!
సోషల్ మీడియా లాంటి వాటిలో యాక్టివ్ గా ఉండరు. ఎక్కడా ఒక్క పోస్టు కూడా పెట్టరు. కానీ.. ఇతరులను మాత్రం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు.
- FB
- TW
- Linkdin
Follow Us

మిమ్మల్ని నిత్యం గమనించే రాశులు..
ఈరోజుల్లో సోషల్ మీడియాని ఉపయోగించనివారు ఎవరూ లేరనే చెప్పాలి. దాదాపు అందరూ వాడేవారే.తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ సోషల్ మీడియాలో షేర్ చేసేవారు కొందరు ఉంటారు. అయితే, మీరు షేర్ చేసే సమాచారాన్ని మరి కొందరు సీక్రెట్ గా గమనిస్తున్నారని మీకు తెలుసా? జోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారు.. ఈ సోషల్ మీడియా లాంటి వాటిలో యాక్టివ్ గా ఉండరు. ఎక్కడా ఒక్క పోస్టు కూడా పెట్టరు. కానీ.. ఇతరులను మాత్రం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మీరు పెట్టిన పోస్టు ని చూస్తారు. కానీ లైక్, కామెంట్ లాంటివి చేయరు. మరి, అలాంటి రాశులేంటో చూద్దామా...
1.వృశ్చిక రాశి( Scorpio)..
వృశ్చిక రాశివారిని మీరు తక్కువ అంచనా వేయద్దు. మీరు మిమ్మల్ని నిత్యం గమనిస్తూనే ఉంటారు. ఈ రాశివారిని డిజిటల్ డిటెక్టివ్స్ అని పిలవొచ్చు. మీరు వీరికి ఏం చెప్పకపోయినా మీ గురించి మొత్తం డేటా వీరి దగ్గర ఉంటుంది. మీరు ఏదైనా దాచి పెట్టాలి అనుకున్నా కూడా దాచి పెట్టలేరు. చిన్న హింట్ దొరికినా కూడా మొత్తం కూపీ లాగేస్తారు.
2.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు కూడా తమ స్నేహితులు, బంధువుల సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. కొత్తగా పెట్టిన పోస్టులు మాత్రమే కాదు.. మీరు గతంలో షేర్ చేసుకున్న వాటిని కూడా గమనిస్తూ ఉంటారు. వాటిలో వారికి నచ్చని విషయం ఏదైనా ఉంటే.. మనసులోనే పగ కూడా పెంచేసుకుంటారు. కానీ, ఆ విషయాన్ని మాత్రం మీకు తెలియనివ్వరు.
3.మీన రాశి...
మీన రాశివారు ఎప్పుడూ కలల ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఫీడ్ ని కూడా వీరు చాలా ఆసక్తిగా గమనిస్తారు. కానీ, వారు ఇతరుల ఫీడ్ చెక్ చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం అస్సలు బయటకు తెలియనివ్వరు. అడిగినా కూడా తమకు తెలీదు అన్నట్లుగానే ప్రవర్తిస్తారు.
4.మిథున రాశి..
మిథున రాశివారు ఇతరుల వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. ఒక విషయం తర్వాత మరో విషయం మనకు తెలీకుండానే మన గురించి సమాచారం మొత్తం లాగేస్తారు. అలాంటి టాలెంట్ ఈ రాశివారికి మాత్రమే సాధ్యం.
5.కన్య రాశి..
కన్య రాశి వారికి కూడా ఇతరుల సమాచారం తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా పోస్టు షేర్ చేస్తే... మీ పోస్టులో కనిపించని డీటెయిల్స్ ను కూడా వీరు గుర్తించగలరు. పోలీసు దొంగ గురించి సమాచారం తెలుసుకున్నట్లు.. ఈ రాశివారు అన్ని విషయాలను గమనిస్తారు. ఈ విషయంపై వీరికి ఉన్నంత ఇంట్రస్ట్ మరెవరికీ ఉండదు.
6.మకర రాశి...
మకర రాశివారిని కూల్ అండ్ కలెక్టెడ్ స్పైస్ అని పిలవచ్చు. వీరు ఎప్పుడూ ప్లాన్ తో ముందుకువెళతారు.వీరికి అవసరం అనిపిస్తే.. ఎవరి సమాచారాన్ని అయినా సేకరిస్తారు. ఇతరులకు తెలీకుండా వారి సమాచారం మొత్తం తెలుసుకోవడం మకర రాశివారికే సొంతం.