Birth Date: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారిపై కృష్ణుడి కృప.. ఉద్యోగంలో పదోన్నతి..!
ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాదు.. ఎప్పటి నుంచో ఇల్లు, వాహనం కొనాలి అనుకునేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

numerology
హిందూ పండగలలో శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. కృష్ణుడు జన్మదినం సందర్భంగా ఈ పండగను జరుపుకుంటూ ఉంటాం. ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్టు 16వ తేదీ వస్తోంది. వస్తూ వస్తూనే.. కొన్ని తేదీల్లో పుట్టిన వారి జీవితంలో వెలుగులు నింపడానికి రెడీ అయ్యింది. శ్రీకృష్ణుడి కృప కారణంగా నాలుగు తేదీల్లో పుట్టిన వారి లైఫ్ పూర్తిగా మారిపోనుంది. మరి, ఆ తేదీలేంటి? వారికి కలిగే లాభాలు ఏంటి అనే విషయం తెలుసుకుందాం...
నెంబర్ 2... ఉద్యోగంలో పదోన్నతి...
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 2,11, 20, 29 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు శ్రీకృష్ణామి తర్వాత వారి లైఫ్ లో కొత్త వెలుగు రానుంది. ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాదు.. ఎప్పటి నుంచో ఇల్లు, వాహనం కొనాలి అనుకునేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.వారి సొంతింటి కల, సొంత వాహన కల కూడా నిజమయ్యే అవకాశం ఉంది. వీరికి జన్మాష్టమి ఊహించని శుభాలను మోసుకురావడం పక్కా.
అంతేకాదు.. శ్రీకృష్ణుడి ప్రత్యేక ఆశీస్సులు ఈ తేదీల్లో పుట్టినవారిపై ఉండటం వల్ల జీవితంలో ప్రేమ పెరుగుతుంది. అదేవిధంగా, వైవాహిక జీవితానికి సంబంధించి మీ జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 11 అవుతుంది.
నెంబర్ 3.. అద్భుతమైన సహాయం...
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ ఏడాది కృష్ణాష్టమి శుభాలను తీసుకురానుంది. ముఖ్యంగా.. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఇతరుల నుంచి పెద్ద సహాయం అందనుంది. ఈ సహాయంతో వీరు పని, వ్యాపారంలో ముందుకు సాగడానికి మంచి అవకాశాలు పొందుతారు. ఈ అవకాశాలను సరైన మార్గంలో వీరు ఉపయోగించుకోగలిగితే.. వీరు జీవితం ఆనందంగా మారుతుంది. ఇక.. జన్మాష్టమి తర్వాత నుంచి వీరు జీవితంలో ఆనందాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి వీరిపై ప్రేమ ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. వీరి అదృష్ట సంఖ్య 18.
నెంబర్ 6.. జీతం పెరుగుదల..
శ్రీ కృష్ట జన్మాష్టమి తర్వాత నెంబర్ 6 జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 6 కిందకు వస్తారు. వీరిపై కృష్ణుని కృప ఉంటుంది. ఉద్యోగం లో మంచి స్థాయికి వెళ్లగలరు. వీరి జీతం కూడా పెరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్షణాలు ఇప్పుడు ఎదురౌతాయి. వీరి అదృష్ట సంఖ్య 4
నెంబర్ 7... కొత్త వాహనం కొనుగోలు...
ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా, నెంబర్ 7 కి చెందిన వారు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. ఈ రోజున, 7 సంఖ్య ఉన్న వ్యక్తులు అపారమైన ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా మీ సంపదను పెంచుకోవడానికి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఏ నెలలోనైనా 7, 16 , 25 తేదీలలో జన్మించిన వారి సంఖ్య 7 అవుతుంది. వీరి అదృష్ట సంఖ్య 18.
2025 శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ పైన పేర్కొన్న నాలుగు సంఖ్యలు, అంటే సంఖ్య 2, సంఖ్య 3, సంఖ్య 6 ,సంఖ్య 7 లకు చెందిన వారికి గొప్ప శుభాన్ని తెస్తుంది. ఈ కాలంలో, మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మీరు వేసే ప్రతి అడుగులోనూ చాలా లాభం పొందుతారు. కాబట్టి ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి మీ ఆనందం, శ్రేయస్సు, డబ్బు , సంపదను పెంచడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని మీకు ప్రసాదిస్తుంది.