Zodiac Signs : ఏ రాశివారు ఏం చేస్తే అప్పుల బాధ తొలగిపోతుందో తెలుసా?
ఈ రోజుల్లో చాలామందికి అప్పు పెద్ద భారంగా మారింది… కానీ సరైన పరిహారాలు, పూజలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అప్పుల భారాన్ని తగ్గించే సులభమైన పరిహారాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

మేషం, వృషభరాశి వారు ఏం చేయాలి?
మేషం
సోమవారం నల్ల గుడ్డలో మిరియాలు, అల్లం కట్టి నీటిలో వదలండి. బుధవారం తులసిని కృష్ణుడికి సమర్పించి నమస్కరించండి.
వృషభం
బహుళ అష్టమి/నవమి రోజు కాలభైరవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి.
మిథునం, కర్కాటక రాశివారికి పరిహారం
మిథునం
అమ్మవారిని పూజించి రూ.11 హుండీలో వేయాలి. కొంత డబ్బుతో పేదలకు పొంగలి పెట్టండి.
కర్కాటకం
బతికున్న పీతను కొని నది/సముద్రంలో వదలండి. కరూర్ పశుపతీశ్వర దర్శనం మంచిది.
సింహం, కన్యరాశివారు ఏం చేయాలి?
సింహం
నెలకోసారి దగ్గర్లోని విష్ణు ఆలయాన్ని శుభ్రం చేయండి. నీటితో నేల తుడవడం పుణ్యకార్యం.
కన్య
లాయర్లకు పెన్ను బహుమతిగా ఇవ్వండి. ధర్మపురి కోటలోని కాలభైరవుడిని దర్శిస్తే అప్పులు తగ్గుతాయి.
తుల, వృశ్చికం
తుల
బియ్యం పిండితో దీపం చేసి, వెలిగించకుండా అమ్మవారి గుడిలో చీమలకు ఆహారంగా పెట్టండి.
వృశ్చికం
శుక్రవారం కాళికాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించి పూజించండి. అప్పుల బాధలు తగ్గుతాయి.
ధనుస్సు, మకర రాశివారు ఏం చేయాలి?
ధనుస్సు
గోరింటాకు రుబ్బి మేనమామ చేతులకు పెట్టండి. బంధం బలపడి, ధన ప్రవాహం మెరుగవుతుంది.
మకరం
మీ పరుపు, దిండు కవర్లను మీరే ఉతుక్కోండి. తిరునీర్మలై రంగనాథుడిని దర్శించండి.
కుంభ. మీనరాశివారి పరిహారం
కుంభం
ప్రదోషం రోజు తంజావూరు పెద్ద గుడికి వెళ్లి నంది అభిషేకం చూడండి. మానసిక ఒత్తిడి తగ్గి పరిష్కార మార్గాలు దొరుకుతాయని నమ్మకం.
మీనం
సముద్రపు నీటిని తెచ్చి, అప్పు తీసుకున్న వారి పేరును నీలి పెన్నుతో రాసి ఆ కాగితాన్ని నీటిలో 3 సార్లు ముంచి తీయండి. అరుణాచలం దర్శనం అప్పుల భారాన్ని తగ్గిస్తుంది.
గమనిక : జ్యోతిష్యులు, ఆస్ట్రాలజీ నిపుణులు వివిధ సందర్భాల్లో సూచించిన పరిహారాలను బట్టి ఈ కథనం అందిస్తున్నాం.

