- Home
- Astrology
- Cancer Horoscope 2026: కర్కాటక రాశికి 2026లో గ్రహాలు అనుకూలిస్తాయా? శని పరీక్ష ఎదుర్కోక తప్పదు
Cancer Horoscope 2026: కర్కాటక రాశికి 2026లో గ్రహాలు అనుకూలిస్తాయా? శని పరీక్ష ఎదుర్కోక తప్పదు
Cancer Horoscope 2026: కర్కాటక రాశిలో జన్మించిన వారి ఆర్థిక, వృత్తి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయా? కొత్త సంవత్సరం వీరికి ఎలా ఉంటుందో చూద్దామా...

కర్కాటక రాశి 2026 ఆర్థిక జీవితం..
జోతిష్యశాస్త్రం ప్రకారం, 2026 సంవత్సరంలో అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. ముఖ్యంగా బృహస్పతి, శుక్రుడు, బుధుడు కూడా రాశిని మార్చుకుంటున్నాయి. ఈ గ్రహాల స్థానాలు కొన్ని సార్లు 12 రాశుల వారికి ఆస్తి, వాహనాలు, నగలు, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు అందిస్తాయి. మరి, 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆర్థిక, కెరీర్ భవిష్యత్తు ఏమిటి? సమయానికి డబ్బు చేతికి అందుతుందా? ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుందా?
కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం సవాళ్లతో నిండి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ఆర్థిక పరిస్థితి, కెరీర్ లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. మీ జాతకంలో అదృష్ట గృహంపై శని ప్రభావం ఉండటం వల్ల, విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో ఖర్చులు, చిన్న నష్టాలు రావచ్చు. ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు వస్తాయి. అయితే... ఖర్చులు పెరగడంతో ఆదాయం కూడా తగ్గుతుంది.
కర్కాటక రాశివారి ఆర్థిక జీవితం సంవత్సర ప్రారంభంలో...
2026 సంవత్సర ప్రారంభంలో కర్కాటక రాశివారికి చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే, మీ కృషితో అన్ని సమస్యలను అధిగమిస్తారు. ఇలాంటి సమయంలో ఉద్యోగం మారాలి అనుకోవడం కరెక్ట్ కాదు. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం పొడవునా శని మీ జాతకంలో తొమ్మిదో ఇంట్లో ఉంటాడు. దీని వల్ల ప్రయాణ, ఉన్నత విద్య వంటి రంగాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అన్ని రంగాల్లోనూ ఆటంకాలు ఎదురౌతాయి. మీరు ఎంత కష్టపడినా.. కోరుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అత్యవసర పనుల కోసం ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సంవత్సరం మధ్యలో...
సంవత్సరం మధ్యలో కర్కాటక రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. జూన్ 2026 తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బృహస్పతి లగ్నంలోకి ప్రవేశించడంతో పనిలో మీ ప్రభావం పెరుగుతుంది. అలాగే, మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు బలపడతాయి. ఈ కాలం మీ కెరీర్ కు చాలా శుభప్రదం. ఈ సమయంలో , దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలమిస్తాయి. మీరు లాభం కోసం కొత్త అవకాశాలను కనుగొంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరగడం లాంటివి జరగొచ్చు. ఈ సమయంలో ఉద్యోగం మారాలి అనుకునేవారికి కరెక్ట్ సమయం. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నవారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు.
సంవత్సరం చివర్లో....
కర్కాటక రాశివారి ఆర్థిక పరిస్థితి 2026 చివరి నెలల్లో మెరుగుపడుతుంది. అక్టోబర్ 31, 2026 తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఈ కాలంలో బృహస్పతి మీ రెండో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీరు డబ్బు ఎక్కువగా ఆదా చేయగలరు. కుటుంబ వ్యాపారాలలో పాల్గొనే వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తగ్గిపోతాయి. ఈ సమయంలో ఎందులో పెట్టుబడులు పెట్టినా బాగా కలిసొస్తుంది. సంవత్సరం చివరలో మీ ఆదాయం పెరుగుతుంది.

