Astrology Believes: పెళ్లైన మహిళలు తలస్నానం చేసిన తర్వాత ఈ పొరపాటు చేయకూడదు
Astrology Believes: శాస్త్రాల ప్రకారం, వివాహిత స్త్రీలు కొన్ని పొరపాట్లు చేయకూడదు. తెలిసీ, తెలియక చేసే ఈ పొరపాట్ల కారణంగా ఆమె కుటుంబం మొత్తం సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.

పెళ్లైన మహిళలు చేయకూడనివి ఇవే...
హిందూ మతంలో స్త్రీలను లేదా గృహిణులను లక్ష్మీదేవి స్వరూపాలుగా భావించి, వారిని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. పెళ్లి తర్వాత ప్రతి మహిళ చేసే ప్రతి మంచి, చెడు కర్మల ఫలితాలను ఆమె మాత్రమే కాకుండా ఆమె కుటుంబానికి కూడా వర్తిస్తాయి. హిందూ శాస్త్రాల ప్రకారం, పెళ్లైన మహిళలు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. మరి, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం....
తడి జుట్టుతో ఇలా చేయకూడదు....
సాధారణంగా, స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత నుదుటిపై బొట్టు లేదా కుంకుమ పెట్టుకుంటారు. కానీ, పొరపాటున కూడా పెళ్లైన స్త్రీలు.. తడి జుట్టుతో ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకోకూడదు. తడి జుట్టుకు కుంకుమ తగలడాన్ని అశుభంగా భావిస్తారు. దీనితో పాటు.. జుట్టు విరబోసుకొని దేవుడికి పూజ చేయకూడదు.
వీటిని ఎవరికీ ఇవ్వొద్దు...
వివాహిత స్త్రీలు గాజులు, కుంకుమ, నల్ల పూసలు, పువ్వులు వంటి శుభప్రదమైన వస్తువులను దానం చేసేటప్పుడు లేదా ఇతరులతో పంచుకొనేటప్పుడు.. మీరు ఉపయోగించినవి ఎవరికీ ఇవ్వకూడదు. ఇది మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల మీ అదృష్టం తగ్గే ప్రమాదం ఉంది.
ఉపవాసం చేసే సమయంలో ఈ తప్పు చేయకూడదు...
వివాహిత స్త్రీలు ఉపవాసం లేదా మరేదైనా వ్రతం చేసేటప్పుడు, ఇతరుల ఇళ్లలో ఆహారం తినడం లేదా పానీయాలు తాగడం మానుకోవాలి. అంతేకాకుండా, ఉపవాస సమయంలో తరచుగా నీరు తాగడానికి వెళ్లకూడదు. మీరు ఏ ఉపవాసం చేయాలనుకున్నా, దానిని కఠినంగా చేయండి. లేకపోతే, దానిని చేయవద్దు.
వీటిని తినొద్దు...
వివాహిత స్త్రీలు ఇతరుల ఇళ్లలో ఉచితంగా ఉప్పు , నువ్వులను తినకూడదు. అలాగే, ఈ రెండు వస్తువులను ఎవరితోనూ మార్పిడి చేసుకోకూడదు. అందువల్ల, ఇతరుల ఇళ్ల నుండి ఉప్పు , నువ్వులను ఉచితంగా తీసుకోవడం లేదా తినడం అశుభ పరిణామాలను తెస్తుంది.
దానం చేసేసమయంలో....
ప్రతి ఒక్కరూ తమ శక్తికి అనుగుణంగా క్రమం తప్పకుండా దానం చేయాలి. అయితే, వివాహిత స్త్రీలు ఇతరులకు దానం చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహిత స్త్రీలు ఎప్పుడు దానం చేసినా, రెండు చేతులు జోడించి దానం చేయాలి. ఈ విధంగా దానం చేయడం వల్ల కుటుంబం సుసంపన్నంగా ఉంటుంది.

