గృహ ప్రవేశం రోజు పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా.? అసలు కారణం ఏంటంటే..
కొత్త ఇంట్లోకి వెళ్లినా, లేదా కొత్తగా అద్దెంటికి వెళ్లినా మొదట చేసే పని పాలు పొంగించడం. అయితే పాలు పొంగించడం వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ శాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు మరిగించే ఆచారం ఎందుకు?
హిందూ సంప్రదాయంలో పాలను పవిత్రత, శుభం, సౌభాగ్యంగా పరిగణిస్తారు. కొత్త ఇంట్లో తొలిసారి వంట చేసే సంకేతంగా వంటగదిలో పాలు మరిగిస్తారు. పాలు పొంగి బయటకు రావడం ఆనందం, ఐశ్వర్యం, శ్రేయస్సు అధికమవుతుందని నమ్మకం.
పాలు పొంగడం వెనుక నమ్మకం
సాధారణంగా పాలు పొంగి కింద పడితే అది అనుకూలం కాదని భావిస్తారు. అయితే గృహప్రవేశంలో మాత్రం ఇది శుభప్రదంగా పరిగణిస్తారు. కారణం ఏమిటంటే — పాత్ర నుంచి పాలు పొంగి బయటకు వచ్చినట్లే, కొత్త ఇంట్లో ఆనందం, సంతోషం, ధనం కూడా పెరుగుతాయని విశ్వసిస్తారు.
వాస్తు దోషాలను తొలగించే శక్తి
కొత్త ఇల్లు నిర్మించినప్పుడు ప్రతికూల శక్తి లేదా వాస్తు దోషాలు ఉండే అవకాశం ఉందనే భయం ఉంటుంది. పాలను పవిత్రతంగా భావించడం వల్ల, పాలు మరిగేటప్పుడు వచ్చే ఆవిరి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని, నెగటివ్ ఎనర్జీ తొలగుతుందని అంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..
జ్యోతిష్యశాస్త్రంలో పాలు చంద్రునికి సూచకం, అగ్ని కుజునికి సూచకం. గృహప్రవేశ సమయంలో పాలు పొయ్యి మీద మరిగితే చంద్రుడు–కుజుని కలయిక శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ కలయిక కుటుంబానికి శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం కలిగిస్తుందని విశ్వసిస్తారు.
గృహప్రవేశంలో పాలు మరిగించే ప్రాముఖ్యత
ఇల్లు అనేది కేవలం గోడలు కాదు, అది కుటుంబ సంతోషానికి పునాది. అందుకే గృహప్రవేశ సమయంలో పాలు మరిగించడం సంప్రదాయం కేవలం ఆచారం మాత్రమే కాకుండా, కుటుంబ శ్రేయస్సు కోసం చేసే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక చర్యగా భావిస్తారు.