ఈ రాశుల వారు నల్లదారం అసలే కట్టుకోకూడదు.. కట్టుకుంటే ప్రాణాలకు ముప్పే..!
సాధారణంగా మగవాళ్లు, ఆడవాళ్లు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేతికో, కాలికో నల్లదారాన్ని కట్టుకుంటున్నారు. ఈ నల్లదారం ఉంటే దిష్టి తగలదని, చెడు కన్ను మన మీద పడదని నమ్ముతారు. అయితే జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారు ఈ నల్లదారాన్ని అసలే కట్టుకోకూడదు. ఎందుకంటే ఇది వీళ్లకు ప్రమాదకరంగా మారుతుంది.
మనం ఎన్నో పద్దతులను, సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నాం. చాలా మంది ఏ పనిచేసినా శాస్త్రాల ప్రకారమే చేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం ఇతరులు చేస్తున్నారని ఏదీ తెలుసుకోకుండా వారు కూడా చేస్తుంటారు. ఇలా చేసేవాటిలో నల్లదారం కట్టుకోవడం ఒకటి. ప్రస్తుత కాలంలో నల్లదారాన్ని కట్టుకోవడం ఫ్యాషన్ లా మారిపోయింది. అమ్మాయిలు, అబ్బాయిలు అంటు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేతికో, కాలికో ఒక నల్లదారాన్ని కట్టుకుంటున్నారు. కొంతమంది దీన్ని ఫ్యాషన్ కోసమే కట్టుకుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. నల్ల దారాన్ని అందరూ కట్టుకోకూడదు. ఎందుకంటే ఈ నల్లదారాన్ని ఉపయోగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే ఎవరు కట్టుకోవాలి? ఎవరు కట్టుకోకూడదో శాస్త్రాల్లో వివరించబడి ఉంది. దీన్ని లెక్క చేయకుండా ఎవరు పడితే వారు కట్టుకుంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఏయే రాశుల వారు నల్లదారాన్ని కట్టుకోకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మకర రాశి, తులా రాశి, కుంభరాశి వారు నల్లదాన్ని కట్టుకోవచ్చు. వీరికి నల్లదారాన్ని కట్టుకోవడంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ మేషరాశి, వృశ్చిక రాశి వారు నల్ల దారాన్ని అస్సలు కట్టుకోకూడదు. ఈ రంగు వీరికి అశుభంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కుజుడు మేష, వృశ్చిక రాశుల వారిని పరిపాలిస్తాడు. అందుకే ఈ రాశుల వారికి నలుపు మంచిది కాదని జ్యోతిష్యులు చెప్తారు. వీళ్లు నల్లదారిన్న ధరిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందట.
red thread
నల్ల తాడును ఉపయోగించడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. మీ చేతికి లేదా కాలికి నల్లతాడును కట్టాలంటేనల్ల తాడును నాలుగు సార్లు ముడులు వేయాలి. ఈ తాడును మంచి సమయంలోనే కట్టుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో నల్లతాడును కట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే మీ చేతికి ఇప్పటికే పసుపు లేదా ఎరుపు తాడు ఉంటే నల్లతాడును కట్టుకోకండి.
జ్యోతిష్యం ప్రకారం.. శనివారం నల్లతాడు కట్టుకోవడానికి మంచి రోజు. ఎందుకంటే శనివారం శని గ్రహానికి చెందినది. నలుపు శని దేవుడికి ఇష్టమైన రంగు. కాబట్టి మీరు ఈ రోజున నల్లదారాన్ని కట్టుకోవచ్చు. అయితే ఈ తాడును కట్టుకునేటప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠించండి. లేదంటే మీ కుల దేవతను తలచుకోండి. దీనివల్ల నల్లదారానికి బలం పెరుగుతుంది.