శని ప్రభావం తగ్గడానికి మీన రాశివారు ఈ ఏడాది ఏం కొనాలో తెలుసా?
ఉగాది తర్వాత శని గ్రహం మీన రాశిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం మీన రాశి వారిపై గట్టిగానే ఉండనుంది. మరి, ఆ ప్రభావం తగ్గి.. ఈ ఏడాది సంతోషంగా ఉండాలంటే మీన రాశివారు ఏం చేయాలో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
జోతిష్యశాస్త్రం ప్రకారం, శని గ్రహం ఒక రాశిలోకి అడుగుపెడితే రెండున్నర సంవత్సరాలు అదే రాశిలోనే సంచరిస్తాడు. రీసెంట్ గానే.. కుంభ రాశిని వీడి శని.. మీన రాశిలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం శని మీన రాశిలోనే ఉన్నాడు. ఇంకో రెండున్నర సంవత్సరాలు ఇదే రాశిలో కొనసాగుతాడు. అయితే.. ఈ శని ప్రభావం మీన రాశిపై చాలా గట్టిగానే చూపించనుంది. చాలా రకాల సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. మరి, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే.. మీన రాశివారు ఈ ఏడాది ఏం కొనుగోలు చేయడం మంచిది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
black sesame seeds
మీన రాశివారు ఈ ఏడాది కొనాల్సినవి ఇవే..
శని దేవుడు నలుపు రంగు, నల్ల నువ్వులను చాలా ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే, ఈ రాశివారు ఈ ఏడాది నల్ల నవ్వులు కొనుగోలు చేయడం ఉత్తమం. వీటిని కొని దగ్గరలోని శనీశ్వరాలయానికి వెళ్లి ఆయనకు సమర్పించుకోవాలి. ఇలా చేయడం వల్ల.. చాలా వరకు శని ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలను అందుకునే అవకాశం కూడా ఉంటుంది.
అంతేకాదు.. మీన రాశివారు అశుభ ప్రభావాల నుంచి బయటపడాలంటే.. ఆవ నూనె కొనుగోలు చేయడం మంచిది. ముఖ్యంగా శనివారం ఆవనూనె కొనుగోలు చేసి, ముందుగా ఆ నూనెను శని దేవుడికి సమర్పించాలి. ఆ పై నూనెను ఎవరికైనా దానం చేయాలి. ఈ ఏడాది మీన రాశివారు ఆవ నూనె కొనుగోలు చేయడం వల్ల వారికి శుభం జరిగే అవకాశం ఉంది. చాలా రకాల సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది.
మీన రాశి స్థానికులు ఆదివారం లేదా శనివారం బూట్లు,చెప్పులు కొనుగోలు చేయాలి. జ్యోతిషశాస్త్రంలో, పాదాలు,బూట్లు ,చెప్పులు శని గ్రహానికి సంబంధించినవిగా పరిగణిస్తారు.ఇది మాత్రమే బూట్లు మరియు చెప్పులు కూడా మీ విధి ,కర్మకు సంబంధించినవి. కాబట్టి, మీరు బూట్లు ,చెప్పులు కొనుగోలు చేయాలి.