జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కలలో పాము కనిపిస్తే అర్థమేంటో తెలుసా?
పాములు మార్పు, పునర్జన్మ, వైద్యం, ప్రలోభాలు వంటి పౌరాణిక భావనలతో ముడిపడి ఉంటుంది. అందుకే కలలో పాములు కనిపించడం మంచి చిహ్నం అంటున్నారు జ్యోతిష్యులు.

కలలు పడటం చాలా సహజం. కానీ కలలు కూడా మన భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలను చెబుతాయి. అందుకే కలల విషయంలో చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. అయితే చాలా మందికి కలలో పాములు కనిపిస్తుంటాయి. అసలు పాములు కనిపిస్తే మంచిదా? చెడ్డదా? జ్యోతిష్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
వైద్యం లేదా మార్పు
మీ కలలో పెద్ద పాము కనిపిస్తే.. మీకు మానసిక, భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక వైద్యం అవసరమని అర్థం, ఈ కల స్వీయ సంరక్షణకు ప్రాధాన్యతనివ్వడానికి గుర్తు కావొచ్చంటున్నారు జ్యోతిష్యులు.
ఆందోళనను అధిగమించే సూచన
మీరు మీ కలలో పాములను చూసినట్టైతే మీరు యాంగ్జైటీ, గత భయాలతో పోరాడుతున్నారని అర్థం. పాములు మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక సమస్య లేదా పరిస్థితిని సూచిస్తాయి. నిజ జీవితంలో ఈ ఆందోళనను ఎదుర్కోవడానికి ఇది మిమ్మల్ని సవాలు చేస్తుంది.
లైంగిక కోరికలు
పాములు రెచ్చగొట్టే రూపం, ఇంద్రియ కదలికల కారణంగా ఇవి ఎక్కువగా ఇంద్రియ, లైంగికతతో సంబంధం కలిగి ఉంటాయి. మీ కలలో ఒక పెద్ద పాము కనిపిస్తే లైంగికత, కోరికల వ్యక్తీకరణ లేదా మీ ఉద్వేగభరితమైన, మీ భాగస్వామిని కౌగిలించుకోవడానికి ఇది గుర్తు కావొచ్చు. మీ సన్నిహిత సంబంధాలలో బలమైన బంధం కోసం ఈ కల మీకు సూచిస్తుంది.
హెచ్చరిక
మీ కలలో అప్పుడప్పుడు పాములు కనిపించడం మీకు హెచ్చరిక సంకేతం కావొచ్చంటున్నారు జ్యోతిష్యు9లు. అవును కొన్ని సార్లు పాములు హానికరమైన పరిస్థితి గురించి మిమ్మల్ని హెచ్చరిస్తాయి. అందుకే ఇలాంటి కలలు పడ్డప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
పెరుగుదల
పాము పై చర్మం ఊడిపోవడం వంటి కలలు పడితే ఇది పునర్జన్మకు చిహ్నం కావొచ్చు. అలాగే కలలు పాములను చూడటం వ్యక్తిగత ఎదుగుదల, వాస్తవ ప్రపంచంలో పరివర్తన సమయాన్ని సూచిస్తుంది. దీనర్థం మీరు పాత ఆలోచనలు, దినచర్యలు లేదా మీకు ఇకపై ఉపయోగపడని పరిస్థితులను వదిలేస్తున్నారు.