ఈ రాశులవారికి అస్సలు నచ్చనిదేంటో తెలుసా...
ప్రతీ మనిషికి తనదైన ఇష్టాయిష్టాలు.. అభిరుచులు, అభిప్రాయాలు, కోరికలు ఉంటాయి. అది మనిషి మనిషిని బట్టి మారుతుంటాయి. అయితే రాశిని బట్టి ఈ ఇష్టాయిష్టాలు ఏంటో, ఎవరు వేటిని ఇష్టపడుతున్నారో... ఎవరికి ఏమి నచ్చుతుందో.. ఏం నచ్చదో తెలుసుకోవచ్చు.

ప్రతీ మనిషికి తనదైన ఇష్టాయిష్టాలు.. అభిరుచులు, అభిప్రాయాలు, కోరికలు ఉంటాయి. అది మనిషి మనిషిని బట్టి మారుతుంటాయి. అయితే రాశిని బట్టి ఈ ఇష్టాయిష్టాలు ఏంటో, ఎవరు వేటిని ఇష్టపడుతున్నారో... ఎవరికి ఏమి నచ్చుతుందో.. ఏం నచ్చదో తెలుసుకోవచ్చు.
ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు రాశిచక్రనిపుణులు. వారి ప్రకారం పన్నెండు రాశులవారి బలబలాలు.. వారికి నచ్చేవి, నచ్చనికి ఓ లిస్ట్ ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం మీ రాశి ఏంటో.. మీకేది ఇష్టమో క్రాస్ చెక్ చేసుకోండి. లేదా.. మీ కిష్టమైనవారికి ఏది నచ్చదో తెలుసుకుని దానికి చేయకుండా ఉండడానికి కూడా ప్రయత్నించవచ్చు. ట్రై చేయండి..
మేషం : ఈ రాశి వారికి సహనం చాలా తక్కువగా ఉంటుంది. అంటే.. వీరు దేనికోసమూ.. ఎవరికోసమూ ఎదురు చూడడం, ఓపిక పట్టడం ఇష్టపడరన్నట్టు...
వృషభం : Taurus వారు.. ఎవరైనా తమ గురించి మరచిపోవడాన్ని సహించలేరు. సో మీ దగ్గరివారు, ఆప్తులు, ప్రేమికుల రాశి వృషభం అయితే.. కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం.
మిథునం : బోర్ అంటే వీరికి పరమ బోర్. అందుకే వీరిని ఎప్పుడూ బిజీగా ఉంచాల్సి ఉంటుంది. వీరితో ఉండేవారూ ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
కర్కాటక రాశి : Cancer రాశి వారు ఒంటరిగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడరు. ఎప్పుడూ నలుగురిలో కలిసి ఉండడం వీరికి ఇష్టం.
సింహరాశి : సింహంలాగే చాలా స్ట్రాంగ్.. వీరిని ఆజ్ఞాపించడం చాలా కష్టం. ఒకవేళ ఆజ్ఞాపించినా వారు దానికి స్టిక్ ఆన్ అయి ఉండరు.
కన్య : ఈ రాశి వారికి తుఫానులు, ఉరుములు అంటే ఇష్టం ఉండదు. వాటిని ఎక్కువగా ద్వేషిస్తారు. వరుస తుపాను లు వస్తున్న ఈ సమయంలో వీరిని కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిందే.
తులా : ఈ రాశివారు అన్యాయాన్ని ఇష్టపడలేరు. libra చిహ్నంలాగే ఈ రాశివారి మనస్తత్వమూ అందుకు తగ్గట్టుగానే ఉంటుందన్నట్టు. అందుకే ఇలాంటి వారితో మెలిగేటప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం మంచిది.
వృశ్చికం : మీరు Scorpioరాశివారితో స్నేహం చేయాలనుకుంటే, మీరు వారితో మైండ్ గేమ్‌లు ఆడలేరు, వారు మిమ్మల్ని ఇట్టే కనిపెట్టేస్తారు. వెంటనే దూం పారిపోతారు. అందుకే మైండ్ గేమ్ ఆడాలన్న ఆలోచన పక్కన పెట్టడం బెటర్.
ధనుస్సు : మామూలుగా అందరం టెక్స్టింగ్ సరదాగా ఉంటుందని ఇష్టపడతాం. చాటింగ్ చేసేప్పుడు కొన్ని ఎమోజీలతో ఎంజాయ్ చేస్తాం. అది చాటింగ్ ను మరింత ఇంటరాక్టివ్ గా, ఎక్స్‌ప్రెసివ్ గా చేస్తుంది. అయితే, ఈ పప్పులేవీ Sagittarius వద్ద చెల్లవు. ధనుస్సు రాశివారు ఎమోజీలంటే పడదు. కాబట్టి బీ కేర్ ఫుల్.
మకరరాశి : ఈ రాశి వారు సులభంగా ఇబ్బంది పడతారు. అస్సలు PDA అభిమాని కాదు! కాబట్టి ఆ అభిమానాన్ని బహిరంగంగా చూపించడం మానుకోండి.
కుంభం : ఈ రాశివారు ఘర్షణను అస్సలు ఇష్టపడరు. చాలామంది ఎక్కువగా ఆలోచించరు. పరిస్తితులు ఏదైతే అదైందని ఎదుర్కోవడానికి ఇష్టపడతారు. అయితే Aquarius వారు అలా కాదు. వీరికి ఏదైనా సరే ఎదుర్కోవడం అంటే ఇష్టం ఉండదు.
మీనం : విమర్శలంటే Piscesవారికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఈ రాశివారిని పెళ్లాడిన జీవిత భాగస్వాములు అస్సలు చేయకూడని పని వారిని విమర్శించడమే.