Weekly Horoscope: ఈ రాశి వారికి ఈ వారం స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం
Weekly Horoscope: వార ఫలం ( మే 15,2022 మొదలు మే 21, 2022 వరకూ) కొన్ని రాశుల వారికి శుభాలు, మరికొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.ఈ వారం అన్నిరాశుల వారి ఫలితాలు ఇలా వున్నాయి.

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ వారం శుభప్రదంగా మొదలవుతుంది. శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనల్లో స్పష్టత అవసరం. గందరగోళ స్థితికి దూరంగా ఉండాలి. ఎదుగుదలకు అవసరమైన పనులు మొదలుపెట్టాలి. వ్యాపార నష్టం రాకుండా చూడాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సమస్యలు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. సోదరుల సహకారం అందుతుంది. ధనాదాయం మార్గాలు బాగుండును. శుభకార్యములకు ధనం ఖర్చు చేస్తారు. లక్ష్మీధ్యానం మంచిది.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
మీకు ఉత్తమకాలం నడుస్తోంది. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. రావలసిన బకాయిలు సమకూరును. పోయిన వస్తువులు లభించును.అన్నివిధాలా మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పెద్దల ఆశీర్వచనం ఉంటుంది. ఉద్యోగంలో చిక్కులు. ఆర్థిక ఇబ్బందులు. స్థిరాస్తి,గృహనిర్మాణ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంట్లోవారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. దుర్గాదేవిని స్మరిస్తే మంచిది.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ వారం నిండు మనసుతో చేసే పని అద్భుతమైన విజయాన్నిస్తుంది. సమయస్ఫూర్తితో లాభపడతారు. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. సంకల్పం బలంగా ఉంటే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. సంతాన విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అవసరమైన ఖర్చులు. ఆకస్మిక ధన లాభం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపారాల యందు సామాన్యం. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు.ఆంజనేయస్వామిని స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ వారం సర్వోత్తమ కాలం. ఏ పనిచేసినా విజయం మీ సొంతం. మంచి పనులతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సందేహించకుండా లక్ష్యాన్ని సాధించండి. మిత్రుల ద్వారా లాభపడతారు. ఊహించని ధన లాభం. ఉద్యోగులకు పదోన్నతులు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తు వాహన ప్రాప్తి. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. ఎక్కువగా కష్టపడతారు.అనవసరమైన ఆలోచనలు చేస్తారు. అష్టమ శని ప్రభావం వలన పనులలోఆటంకములు, బద్ధకంగా ఉండును. సూర్య నమస్కారంతో మానసిక శక్తి పెరుగుతుంది.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ వారం పూర్తి స్దాయిలో కాలం సహకరించడం లేదు. మిత్రుల సలహా తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. అపార్థాలకు అవకాశముంది. అన్ని విధాలా లాభం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబములోని శుభకార్యములు. భూ గృహ క్రయవిక్రయాల యందు తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను. మంచి విషయాలు ఇతరులతో చర్చిస్తారు. గౌరవప్రదమైన జీవనవిధానాన్ని సాగిస్తారు. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
అదృష్టయోగాన్ని అందుకునే సమయం. ఆత్మస్థైర్యం తగ్గకుండా పట్టువిడుపులతో పనులను పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటమే కలిసొస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. వ్యాపారరీత్యా మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. అన్ని కార్యములకు అనుకూలం. ఆకస్మిక ధన లాభం. స్థిరాస్తి గృహ నిర్మాణం లకు అనుకూలం. సంతాన మూలకంగా లాభం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాలకు అనుకూలం. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. దానధర్మాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇష్టదైవ స్మరణ మంచిది.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారం చాలా బాగుంటుంది. ధనలాభం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. జీవితంలో పైకి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగండి. వృత్తి వ్యాపారము నందు సామాన్యం . నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రులతో కలహాలు . మానసిక ఒత్తిడి. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలెను. ప్రభుత్వ సంబంధిత కార్యాల్లో ఇబ్బందులు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించవలెను. ఆధ్యాత్మిక చింతన. పుణ్య క్షేత్ర దర్శనం.దుర్గాదేవిని స్మరిస్తే మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ వారం మీ శ్రమ ఫలించే సయమం. మీ చిరకాల ఆశయం నెరవేరుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునే కాలమిది. వ్యాపారంలో జాగ్రత్త. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. శుభకార్యాల గురించి చర్చిస్తారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు జాప్యం జరిగినా మిత్రుల సహకారంతో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. స్థానచలనం. అధిక ఖర్చు. ఆంజనేయస్వామిని స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ వారం శుభప్రదంగా మొదలవుతుంది. శుభ కార్యాచరణ. ధనవ్యయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబము నందు ఆనందకరమైన వాతావరణం. ఆలోచనల్లో స్పష్టత అవసరం. గందరగోళ స్థితికి దూరంగా ఉండాలి. ఎదుగుదలకు అవసరమైన పనులు మొదలుపెట్టాలి. వ్యాపార నష్టం రాకుండా చూడాలి. దైవ చింతన. ఉద్యోగ వ్యాపారాల యందు ధనలాభం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. అన్నదమ్ముల సహకారం. సూర్య నమస్కారం శుభప్రదం.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
సోదరులతో విభేదాలు. సమయస్ఫూర్తితో సమస్యలు తొలగుతాయి. అధికార లాభం సూచితం. భారీ లక్ష్యాలతో ముందడుగు వేయాలి. వ్యాపారంలో సమస్య రాకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక నష్టం సూచితం. సమష్టి నిర్ణయాలతో మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. అనవసరపు ఖర్చులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. రుణ బాధలు. భూ గృహ క్రయవిక్రయాల విషయంలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. సంఘంలో ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించవలెను. నచ్చిన దైవాన్ని దర్శించండి, శుభం జరుగుతుంది.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
వృత్తి వ్యాపారాల యందు ధనలాభం. పట్టుదలతో ముందుకు సాగండి. కొందరివల్ల మేలు జరుగుతుంది. స్వయంకృషితోనే అభివృద్ధి సాధ్యం. కాలం కొంత వ్యతిరేకంగా ఉన్నందువల్ల సంయమనం పాటించండి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు. ఆనందకరమైన జీవితం. శుభ కార్యాచరణ. రావలసిన బకాయిలు వసూలవుతాయి. పోయిన వస్తువు తిరిగి లభిస్తాయి. ఇతరులకు సహకారం చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలకు అనుకూలం. వారం మధ్యలో ఆనందించే అంశముంది. అపోహలు తొలగుతాయి. కొన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. ఆవేశపరిచే వారున్నారు. శాంతంగా మాట్లాడాలి. కొత్త వ్యక్తుల పరిచయం. నూతన వస్తు వాహన ప్రాప్తి. ఆర్థిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పనుల యందు పట్టుదల ప్రదర్శిస్తారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మనసులో ఉన్న అభిప్రాయాలను సన్నిహితులతో చర్చిస్తారు. అధిక ఖర్చు. వ్యాపారాల యందు సామాన్యం. విష్ణుసహస్ర నామం చదివితే మంచిది.
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)