MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు!

Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 21.12.2025 నుంచి 27.12.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

3 Min read
Author : Kavitha G
Published : Dec 21 2025, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : AI

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ తెలివితేటలతో ఇంటా బయటా అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. నూతన వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు అనుకూలం. 

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. ఇతరులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని బాధపడతారు. నూతన వ్యాపారాలకు ఊహించని విధంగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. శత్రుపరమైన సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.  

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఇంటా బయటా సమస్యలను పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను నిర్వహించి సమాజంలో పేరు ప్రతిష్ఠలు పొందుతారు. నూతన వాహన యోగం ఉంది. చిన్న నాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.  

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని విషయాల్లోఅశ్రద్ధ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి.  

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్య పరుస్తుంది. పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని తప్పులు సరి చేసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సంఘంలో పెద్దల సహాయంతో కొన్ని పనులను విజయవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. 

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అప్పులను సైతం తీర్చగలుగుతారు. ఆప్తుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యల నుంచి ఓర్పుతో బయటపడతారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. గృహ కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు.  

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు సర్దుమణుగుతాయి. పాత మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.  

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలం. పాత మిత్రులతో ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. 

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఇంటా బయటా సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విలువైన సమాచారం అందుతుంది. 

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన పరిచయాలు లాభదాయకంగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు తొలగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఆర్థిక పురోగతి కలుగుతుంది. 

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిష్కారం దిశగా సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాలో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. వీరిని పట్టుకోవడం చాలా కష్టం!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారిపై శని దేవుడికి ప్రేమ ఎక్కువ.. కష్టాలు వీరి దరిదాపుల్లోకి కూడా రావు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved