Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
Weekly Horoscope: ఈ వార ఫలాలు 11.1.2026 నుంచి 17.1.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం రాశి ఫలాలు
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వాహన యోగం ఉంది.
వృషభ రాశి ఫలాలు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో స్వల్ప వివాదాలు ఉన్నప్పటికీ రాజీ చేసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
మిథున రాశి ఫలాలు
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువ ఇస్తారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రుల్లా మారిపోతారు. ఉద్యోగాలలో ఊహించని పదవులు లభిస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
స్థిరాస్తి విషయాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. సన్నిహితులు మీ నిర్ణయాలను గౌరవిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు. దూరప్రాంత బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సింహ రాశి ఫలాలు
విద్యార్థుల విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్,తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వారాంతంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కన్య రాశి ఫలాలు
ఆదాయం అంతగా లేకపోయినా ఖర్చులకు ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలిక వివాదాలు సర్దుమణుగుతాయి. మిత్రులతో మనస్పర్ధలు తొలగుతాయి. ముఖ్యమైన విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మంచి ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. అధికారుల నుంచి ఊహించని అనుకూలత కలుగుతుంది.
తుల రాశి ఫలాలు
సమయానికి డబ్బు సహాయం లభించదు. కొన్ని ప్రయత్నాలు కలిసిరావు. పనులు, ఆలోచనలు మందకొడిగా సాగుతాయి. అనుకోకుండా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. వారాంతంలో నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సోదరులతో ఉన్న మనస్పర్థలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. అవసరానికి తగినట్టు నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు అనుకూలం.
ధనుస్సు రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆదాయం బాగుంటుంది. వ్యాపార విస్తరణకు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ పూర్తి చేస్తారు. కుటుంబ సంబంధిత వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. కొన్ని ఆలోచనలు ఆచరణలో పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
మకర రాశి ఫలాలు
భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగుతారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలను కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకూలం. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాలలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి.
కుంభ రాశి ఫలాలు
సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయంలో తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. శత్రు సంబంధిత సమస్యలపై పైచేయి సాధిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మీన రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆర్థిక ఒడిదుడుకుల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి ఉంటుంది.

