MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వార ఫలాలు: ఓ రాశివారికి వీకెండ్ లో అనుకోని ఖర్చులే కానీ ఆనందకరం

వార ఫలాలు: ఓ రాశివారికి వీకెండ్ లో అనుకోని ఖర్చులే కానీ ఆనందకరం

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

6 Min read
Mahesh Rajamoni
Published : Dec 11 2022, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ వారం ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. శారీరక శ్రమ తగ్గి సుఖం లభించును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సమాజం నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సంఘమునందు సన్మానాలు సత్కారాలు అందుకుంటారు.  ఆకస్మిక ధన లాభం. మిత్రుల యొక్క ఆదర అభిమానము లు కలుగుతాయి. వృత్తి వ్యాపారములు ధన లాభం కలుగుతుంది. సంతానం అభివృద్ధి మీకు సంతోషం కలిగిస్తుంది. పొదుపు పథకాలుపై దృష్టి పెడుతుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు . వారాంతంలో అనుకొని ఖర్చులు పెరుగుతాయి. మనసునందు అనేకమైన ఆలోచన వలన చికాకుగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది .  పనులలో ఆటంకాలు ఏర్పడతాయి .

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అనవసరవెన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి..  దీర్ఘకాలిక అనారోగ్యములో   ఇబ్బందిగా మారుుతాయి.. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు తగ్గించును.. చేయ పనుల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఆటంకాలు ఎదురౌతాయి.ఉద్యోగం నందు అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో సామాన్యముగా ఉండును.  ఇతరులతో  సౌమ్యంగా వ్యవహరించవలెను. చేయు ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  భార్యాభర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. బుద్ధి కుశలత తగ్గుతుంది. మనస్సునందు ఆందోళనగా ఉంటుంది.  మీ తోటి ఉన్నవారే మీకు అపకారం జరుగుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించడం కష్టంగానే ఉంటుంది.  భూ గృహ నిర్మాణ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి . ఇంట్లో పెద్దవారు యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని వలెను. వారాంతంలో తల పట్టిన పనులు పూర్తవుతాయి. మానసికంగా శారీరకంగా సౌఖ్యం లభిస్తుంది.  మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి .
 

413


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఈ వారం ఈ వారి వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం.  ప్రయత్నించను పనులలో విజయం సాధిస్తారు.. వృత్తి వ్యాపారాలలో ఊహించిన విధంగా ధన లాభం కలుగుతుంది.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. నూతన ప్రయత్నాలకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజం నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. చేయ ఉద్యోగం నందు అధికారులు మన్నన పొందుతారు. సంతానం మూలంగా  అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వారాంతంలో మనసునందు ఆందోళనగా ఉండుట. వచ్చిన అవకాశాలని తెలివితేటలుగా అందుపుచ్చుకొనవలెను.  పనుల్లో ఆటంకాలు ఏర్పడును.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

ఈ వారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనస్సు నందు అనేక ఆలోచనలతోటి చికాకుగాగా ఉండును. ఇంట బయట ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. నిరాశ నిస్పృహలకు లోనవుతారు. పుత్రుల తోటి విరోధం ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడ వచ్చును.  ఉద్యోగమునందు అధికారులతోటి విభేదాలు రావచ్చును. సమాజము నందు అనవసరమైన కలహాలు ఏర్పడుతాయి. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కొంతమేరకు రుణం చేయవలసి వస్తుంది. మీ పక్కనే ఉన్నవారే మీకు అపకారం చేయాలని చూస్తున్న చూస్తారు. వారాంతంలో గృహం నందు ఆనందకరమైన వాతావరణం . ' మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు . ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

 

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)


ఈ రాశి వారికి పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. నిరాస నిస్పృహలకు లోనవుతారు.  ప్రభుత్వ సంబంధింత పనులు వాయిదా పడుతుంటాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి ఎదురవుతాయి.  సమాజం నందు ప్రతికూలత వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. చేయ వ్యవహారాల యందు కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహారం చేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి ధనం లభించును.  వారాంతంలో కుటుంబం నందు ఆనందోత్సాహారగా గడుపుతారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకార లభిస్తాయి

713


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ వారం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. గృహము నందు శుభకార్యాలు .  ఆరోగ్యం కుదుటపడి ప్రశాంతత లభిస్తుంది.  గృహము నందు సంఘము నందు గౌరవం పెరుగుతుంది. చేయు వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. శారీరక శ్రమ తగ్గి సుఖం లభించును. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసికంగా శారీరకంగా బలపడతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల యొక్క కలయిక. ఉద్యోగము నందు సహోదయోగల సహకారం లభిస్తుంది. వారాంతంలో ఆదాయం మార్గాలు తగ్గుతాయి. మానసిక ఆవేదనకు గురవుతారు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండడం మంచిది. చేయ పనుల యందు. ఆలోచించి చేయాలి పై అధికారులతోటి వినయంగా ఉండడం మంచిది .
 

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ వారం శుభకరం. వృత్తి  వ్యాపారములు యందు ఊహించిన ధనలాభం కలుగుతుంది. సంఘమునందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనసునందు శారీరకంగా ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపు గడుస్తుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. మిత్రుల యొక్క ఆదరణములు అభిమానములు దొరుకుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగమునందు మీకు తగ్గ అధికారం లభిస్తుంది. భూ గృహు నిర్మాణ విక్రమ విక్రయాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాల యందు అనుకూలమైన తీర్పులు రావచ్చును.  వివాహ ప్రయత్నాలు చేయువారు ప్రయత్నాల ఫలిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వారాంతంలో అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. సంతానం మూలంగా కలతలు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ వారం కాస్తంత జాగ్రత్తగా గడపాల్సిన సమయం.  ఇతరులతోటి వాదనకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక ప్రయాణాలు వలన చీకాకు పుట్టించును. కొన్ని సంఘటనలు వలన ఆందోళనగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. కొంత రుణం చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. సంతానం విషయంలో  ప్రతికూలత ఏర్పడుతుంది. ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వచ్చిన అవకాశాల్ని విడిచిపెడతారు.  గృహ నిర్మాణ పనుల్లో ముందుకు సాగును. కొన్ని సమస్యల ఉద్రేకపరచును.  దురాలోచనలు లకు దూరంగా ఉండవలెను. బంధువుల వలన కొద్దిపాటి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. గృహమునందు ప్రతికూలతలు .వారాంతంలో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగము సంతృప్తికరంగా ఉంటుంది.

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అనుకోని కలహాలు వలన గౌరవం భంగం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.  సంతానం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  ఉద్యోగమునందు పై అధికారులు ఒత్తిడిలు శ్రమ ఎక్కువుగా ఉంటుంది.  మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది.  మీకు అపకారం చేయువారు అధికమవుతారు.  అనవసరమైన ఖర్చులు  ఆందోళనకరంగా మారును. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును. చేయ పని  యందు అలసత్వం ఏర్పడుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండవలెను. బంధుమిత్రుల తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేయడం మంచిది. ప్రభుత్వ సంబంధింత  పనులలో పట్టుదలతో పూర్తి చేయాలి.  ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారమునందు పెట్టుబడుల విషయంలో పెద్దవారి యొక్క సలహాలు మేరకు పెట్టుబడులు పెట్టవలెను.  వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచనలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
 

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ వారం శుభకాలం. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. గృహము నందు ఆనందకరమైన వాతావరణం. ఉద్యోగస్తులకు అధికారం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయు వారికి శుభవార్తలు వింటారు. సంతాన విషయం అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. గృహ నిర్మాణ పనులు అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాల యందు అనుకూలమైన తీర్పులు రావచ్చును. అప్రయత్నంగా ధన లాభం కలుగుతుంది. నూతన వస్తూ వాహనాది కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు గురించి చేయు అభివృద్ధి కార్యక్రమాలు ఫలిస్తాయి. సమాజం నందు గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.   ద్వేష అసూయాలను తగ్గించుకుని వ్యవహరించవలెను. కొత్త సమస్యలు తలనొప్పిగా మారును. మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు కలుగుతాయ.

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

ఈ వారం మీకు ఆనందకర ఫలితాలు సూచిస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులతోటి కలిసి ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.సమాజం నందు మీకు తగ్గ ప్రతిభ తగ్గ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ అభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. పెద్దవార యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన వాదనలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండవలెను.. సహోదర సోదరులతోటికీ మనస్పర్ధలు ఏర్పడతాయి. భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడగలవు.  వారాంతంలో కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణ. గౌరవం మిత్రుల యొక్క ఆదరణ అభిమానములు కలుగుతాయి. వృత్తి వ్యాపారం లాభం కలుగుతుంది.

1313


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)

ఈ వారం మీకు కలిసొచ్చే వాతావరణం కనపడుతోంది. గ్రహాల అనుకూలత. వచ్చిన అవకాశాలని తెలివితేటలుగా అందుపుచ్చుకొనవలెను. ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగానే  ఉంటాయి. ఇతరుల యందు విరోధాలు తగ్గించుకుని వ్యవరించవలెను .  కొత్త సమస్యలు అనుకోకంగా అనుకోకుండా ఏర్పడతాయి. గృహమనందు సమాజము నందు ప్రతికూలత వాతావరణంగా ఉంటుంది. మనస్సునందు అనేకమైన దురాలోచనలు గా ఉండును.  ఇతరుల యందు అసూయ ద్వేషం వదిలి మంచి ఆలోచనలతోటి మెలగాలి. చేయ పనుల యందు పెద్దలు యొక్క ఆలోచనలతో టి చేయవలెను. చేయు పనులయందు సమయస్ఫూర్తి అవసరం . శుభకార్యాలు ఆలోచనలు  వాయిదా వేస్తారు. సహాయ సహకారాలు గురించి ఆలోచనలు పెరుగుతాయి. వారాంతంలో గృహమునందు ఆనందకరమైన వాతావరణం. శారీరక శ్రమ తీరి ప్రశాంతత లభించును. జీవిత వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు . 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved