Venus Transit: మే 8 నుంచి ఈ 3 రాశులకు కుబేర యోగం.. డబ్బులకు లోటే ఉండదు!
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడి సంచారానికి చాలా ప్రాధాన్యం ఉంది. త్వరలో శుక్రుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల 3 రాశులవారికి అదృష్టం తలుపు తట్టనుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు దక్కనున్నాయి. మరి ఆ రాశులేవో తెలుసుకోండి.

శుక్రుడి నక్షత్ర మార్పు
జ్యోతిష్య శాస్త్రంలో సంపద, విలాసం, ప్రేమ, సంతోషాలకు శుక్రుడిని అధిపతిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, వారు రాజభోగాలు అనుభవిస్తారని పండితులు చెబుతుంటారు. మే 8న శుక్రుడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి సంచరించనున్నాడు. ఈ మార్పు అన్ని రాశులపై ప్రభావం చూపినా.. 3 రాశులవారికి జాక్‌పాట్ తగలనుంది. ఆ రాశులు ఏవి? వారికి ఏ విషయాల్లో అదృష్టం కలిసివస్తుందో ఇక్కడ చూద్దాం.
మేషరాశి- కొత్త ఉత్సాహం
శుక్రుడి నక్షత్ర సంచారం మేష రాశి వారికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న గొడవలు సమసిపోయి, విడిపోయిన బంధువులు తిరిగి కలుస్తారు. కొత్త ఇల్లు లేదా భూమి కొనడానికి ఇది సరైన సమయం. పెళ్లికాని యువతకు తగిన జీవిత భాగస్వామి దొరుకుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్నివైపుల నుంచి ఆదాయం వస్తుంది.
వృషభం - పదవి, డబ్బు
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ రాశివారికి శుక్రుడి నక్షత్ర మార్పు మరింత బలాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఊహించని విధంగా జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్ దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారాల్లో మరో స్థాయికి వెళ్తారు. మీ నిర్ణయాత్మక శక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. కష్టమైన సవాళ్లను కూడా చాలా తేలికగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతాయి. దూరప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఏ పని చేపట్టినా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి లాభాలు అందుకుంటారు.
తుల రాశి- రెట్టింపు ఆదాయం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తుల రాశి వారికి శుక్రుడి సంచారం ఆర్థిక స్థితిలో భారీ మార్పులను తీసుకురానుంది. అనేక మార్గాల నుంచి డబ్బు ప్రవాహం పెరుగుతుంది. బ్యాంకులో పొదుపు పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మీ మాటతీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం లాభంతో ముగుస్తుంది. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

