- Home
- Astrology
- Venus Transit: శుక్రుడు నవపంచమ రాజయోగం.. నెల రోజులు ఈ మూడు రాశులకు మహర్దశ, ఇంట్లో కనక వర్షం
Venus Transit: శుక్రుడు నవపంచమ రాజయోగం.. నెల రోజులు ఈ మూడు రాశులకు మహర్దశ, ఇంట్లో కనక వర్షం
Venus Transit: శుక్రుడు మకర రాశిలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే వృషభ రాశిలో ఉన్న యూరేనస్ తో కలిసి నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరిచాడు. దీని ఫలితంగా మూడు రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన విజయాలు లభిస్తాయి.

Venus Transit
వేద జోతిష్య శాస్త్రంలో శుక్రుడికి తొమ్మిది గ్రహాలలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ శుక్ర గ్రహం సంపద, వివాహం, ఆనందం,ప్రేమ, ఆకర్షణకు కారకుడిగా పరిగణిస్తారు. దీని ఫలితంగా శుక్రుడి సంచారం అన్ని రాశులపై ఉంటుంది. కాగా.. జనవరి 13వ తేదీన శుక్రుడు మకర రాశిలోకి అడుగుపెట్టాడు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీని ఫలితంగా శుక్రుడు సూర్యుడు, అంగారకుడు, బుధుడితో కలిసి శుక్రాదిత్య, లక్ష్మీ నారాయణ యోగాలను ఏర్పరుస్తాడు. శని రాశి అయిన మకరంలో ఉన్న శుక్రుడు, వృషభంలో ఉన్న యూరేనస్ తో కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరిచాడు. దీని కారణంగా ఈ నవ పంచమ రాజయోగం మూడు రాశుల జీవితాలను పూర్తిగా మార్చేయనుంది. ముఖ్యంగా డబ్బు పరంగా బాగా కలిసిరానుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం....
వృషభ రాశి..
వృషభ రాశి ఈ నవపంచమ రాజయోగం అనేక విధాలుగా కలిసిరానుంది. దీని కారణంగా ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఈ రాశివారికి అదృష్టం పట్టనుంది. ఏ చిన్న ప్రయత్నం చేసినా.. గొప్ప విజయాన్ని అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. అసలు.. వీరు ఏ రంగం ఎంచుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమాయాన్ని గడుపుతారు.
కర్కాటక రాశి...
శుక్ర గ్రహం కారణంగా ఏర్పడుతున్న నవ పంచమ రాజయోగం కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలను తీసుకురాగలదు.ఈ రాశివారికి అదృష్టం కూడా పెరుగుతుంది. దీని కారణంగా, భౌతిక సుఖాలను అనుభవించవచ్చు. ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆదాయం కూడా అంతే వేగంగా పెరుగుతుంది. జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది.
మకర రాశి...
నవ పంచమ రాజయోగం మకర రాశిలో జన్మించిన వారికి ఆనందాన్ని తెస్తుంది. ఈ నవ పంచమ రాజయోగం కారణంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. అదేవిధంగా సంపద వేగంగా పెరుగుతుంది. మతపరమైన తీర్థ యాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయం వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త కాంట్రాక్టులు, ప్రాజెక్టులను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి సపోర్టు లభిస్తుంది. దీని కారణంగా.. మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. ఇది పదోన్నతికి, ఆదాయం పెరగడానికి దారితీస్తుంది. వైవాహిక జీవితం బాగుండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

