Zodiac Signs: ఈ 6 రాశుల వారు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక, కదలికల వల్ల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. మరో మూడు రోజుల్లో చంద్రుడు, కుజ గ్రహాల సంచార యోగం ఏర్పడనుంది. ఇది 6 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. వారు ఎన్నడూ చూడనంత డబ్బు చూసే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ రాశులెంటో తెలుసుకుందామా?

ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు కుజుడు, చంద్ర గ్రహాల మధ్య సంచార యోగం ఏర్పడనుంది. కుజుడు.. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో, చంద్రుడు కుజ గ్రహానికి చెందిన వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల 6 రాశుల వారికి శుభఫలితాలున్నాయి. ఆ రాశులెంటో ఇక్కడ తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి అధిపతి చంద్రుడు మంగళ గ్రహంలో సంచరిస్తున్నాడు. ఈ రాశి వారికి మంగళ గ్రహం చాలా శుభప్రదం. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ధన యోగం ఉంది. అప్పులు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. షేర్లు లాభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి ఉంటాయి.
కన్య రాశి
కన్య రాశి వారికి తృతీయ, లాభాధిపతుల మధ్య సంచారం వల్ల తక్కువ శ్రమతో ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. షేర్లు లాభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. పిత్రార్జిత ఆస్తులు చేతికి వస్తాయి. ఇల్లు, వాహన సౌకర్యాలు కలుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది.
తుల రాశి
తుల రాశి వారికి ధనాధిపతి, దశమాధిపతుల సంచారం వల్ల ఉద్యోగంలో ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది. తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు విస్తరిస్తాయి. ఎక్కువ జీతం, సౌకర్యాలున్న ఉద్యోగానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి అధిపతి మంగళ గ్రహం శుభ స్థాన అధిపతి చంద్రుడితో కలిసి సంచరించడం వల్ల ఉద్యోగాల్లో జీత భత్యాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేయడానికి ఇది మంచి సమయం. విదేశీ ఆదాయ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషానికి లోటు ఉండదు.
మకర రాశి
మకర రాశి వారికి సప్తమాధిపతి, లాభాధిపతుల సంచారం వల్ల ఉన్నత కుటుంబంలో వివాహం లేదా ప్రేమ బంధం ఏర్పడే అవకాశం ఉంది. అనుకోకుండా డబ్బు చేతికి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. పెద్దల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
మీన రాశి
మీన రాశి వారికి పంచమాధిపతుల సంచారం వల్ల రెండు ధన యోగాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. విదేశీ ఆదాయ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో మంచి విజయం సాధిస్తారు. ఊహించని అదృష్టం కలిసి వస్తుంది. ఆస్తి లాభాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.