MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఫుడ్ చూడగానే.. ఫుల్ గా లాగించడం.. ఓ ముద్ద ఎక్కువే తినడం ఇష్టమా?..అయితే మీది ఈ రాశి అయి ఉంటుంది..చూడండి..

ఫుడ్ చూడగానే.. ఫుల్ గా లాగించడం.. ఓ ముద్ద ఎక్కువే తినడం ఇష్టమా?..అయితే మీది ఈ రాశి అయి ఉంటుంది..చూడండి..

కొంతమంది అతిగా తినేస్తుంటారు. ఎంత అంటే తింటూనే ఉంటారు. అలా అతిగా తినడం సూర్యుని సంకేతం అట. అయితే, ఇది అందరి విషయంలో జరగదు. కొన్ని రాశుల వారు అతి భోజనప్రియులు.. వారెవరో చూడండి..

2 Min read
Author : Bukka Sumabala
Published : Dec 10 2022, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొంత మంది 'బతకడానికి తింటారు'.  మరికొందరు 'తినేందుకే బతుకుతారు'... ఆహార ప్రియులైతే రకరకాల ఆహారపదార్థాలను.. ముఖ్యంగా వారికి ఇష్టమైన పదార్థాలు ఉంటే కడుపునిండినా.. ఏదో రకంగా కాస్త ఎక్కువే పట్టించేస్తుంటారు. అయితే, ఇలా అతిగా తినే స్వభావం సహజంగా మీది కాదట.. మీ రాశి వల్లే అలా జరుగుతుందట.. అదే మీ వ్యక్తిత్వ లక్షణాలను ప్రభావితం చేస్తుందట. అలా అతిగా తినడానికి ఇష్టపడే ఐదు రాశులేవో చూడండి.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Astro

Astro

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 10)

మీనరాశివారు ఆహారం అంటే చాలా ప్రేమను కలిగి ఉంటారు. మంచి ఆహారం వారి నోట్లో లాలాజలాన్ని ఊరేలా చేయడమే కాదు.. నేరుగా వారి హృదయానికి చేరుతుంది. అంతేకాదు తాము తినడానికి ఇష్టపడటం కోసం అతిగా తింటారు. ఒక వేళ ఈ రాశివారికి వంట చేయడంలో నైపుణ్యం ఉంటే, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు లక్ లో పడ్డట్టే.. వారికి రకరకాల రుచికరమైన ఆహారం.. చేసి టేస్ట్ చూపిస్తూ ఉంటారు. ఏది ఉత్తమమైన ఆహారమో కనుక్కోవడం వీరికి చిటికెలో పని.

36

వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)

వృశ్చిక రాశి వారు ప్రతీదాన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటారు. జీవితాన్ని, ఇంటిని, ఆఫీసును తాము అనుకున్నట్టుగా కంట్రోల్ లో పెడతారు. అదే కంట్రోల్ తమ ఆహారం విషయానికి వచ్చేసరికి గాడి తప్పుతుంటుంది. ఈ కంట్రోల్ అంతా అతిగా తినడంలో వ్యక్తమవుతుంది. ఆరోగ్యకరమైన డైట్ లో ఉన్నప్పుడు కూడా తమకిష్టమైన ఫుడ్ కనిపిస్తే ఆగలేరు. ఆకలిని మించి తింటారు.

46

మిథునం (మే 21 - జూన్ 20)

ఈ రాశివారికి అత్యంత ఇష్టమైన పని తినడం. దాన్ని చక్కగా ప్లాన్ చేసి, కొత్త కొత్త రుచులను టేస్ట్ చేస్తుంటారు. వీరితో గెట్ టు గెదర్ అంటే మంచి ఫుడ్ చుట్టే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వీరు ఖాళీగా ఉన్నారంటే.. ఫుడ్ తో చిల్ అవుతూనో.. లేదంటే ఏదో చిరుతిండి నోట్లో ఆడిస్తూనే పనిచేస్తూ కనిపిస్తారు. ఆహరంకంటే వీరికి ఏదీ అంత సంతోషాన్నివ్వదు. అందుకే బెస్ట్ ఫ్రెండ్స్, సరదా, సంతోషం, వర్క్ డెడ్ లైన్ అన్నీ వీరికి తిండితో ముడిపడే కనిపిస్తాయి. 

56

కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)

ఈ రాశి వ్యక్తులు సాధారణంగా తమకు ఆకలేస్తే మాత్రమే తింటారు. అయితే, తాము తినడాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారంటే మాత్రం ఎక్కువ తినేస్తారు. ఎలాగంటే డైటింగ్ చేయమన్నప్పుడు, బరువు తగ్గడానికి ఆహారం తగ్గించమన్నప్పుడు ఇంకాస్త ఎక్కువగా తింటుంటారు. ఆహారం విషయంలో వారు ఎవ్వరు ఏమి చెప్పినా వినడానికి సిద్ధంగా ఉండరు. 

66

తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)

ఈ రాశి వ్యక్తులు ఆహారం, అతిగా తిపడం విషయంలో గజిబిజిగా ఉంటారు. చిరాకుగా ఉంటే అతిగా తింటుంటారు. అదే టైంలో తమ లుక్స్ మీద దృష్టి పెడతారు. ఏ ఫుడ్ లో ఎంత కార్బ్స్ ఉన్నాయి. ఎంత కొవ్వు ఉంది వీరికి తెలుసు. అయితే ఏ చిన్న నెగటివ్ విషయమైనా వీరికి చిరాకు కలిగిస్తే దాన్ని తమకిష్టమైనది తినడంతో ఎండ్ చేస్తుంటారు. 

About the Author

BS
Bukka Sumabala
జ్యోతిష్యం
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved