August Horoscope: ఆగస్టు నెలలో ఈ రాశులకు తిరుగుండదు, శుభవార్తలే వింటారు..!
ఆగస్టు నెలలో ఐదు రాశులకు అదృష్టయోగం పట్టనుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందనున్నారు. మరి, ఆ రాశులేంటో చూద్దామా…

August Horoscope
గ్రహాలు తరచూ మారుతూ ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు రాశులపై చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కాగా, ఈ గ్రహాల మార్పులు ఆగస్టు నెలలో ఐదు రాశులవారికి ఊహించిన ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా..
1.మేష రాశి..
ఆగస్టు నెలలో మేష రాశివారికి బాగా కలిసి రానుంది. కుజుడి ఆధిపత్యం.. మేష రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు కలిగించనుంది. పని లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో బాగా రాణించగలరు. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు ఈ సమయంలో వస్తాయి. ఈ సమయంలో ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. చేసే ప్రతి పనిలోనూ లాభాలు కనిపిస్తాయి.
2.సింహ రాశి...
సింహ రాశిని సూర్యుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ ఆగస్టు నెలలో సింహ రాశివారికి అద్భుతంగా సాగిపోతుంది. ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగం లో ప్రమోషన్స్ దక్కే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
3.తుల రాశి..
శుక్రుని ఆధిపత్యం కారణంగా ఆగస్టులో తుల రాశివారికి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. కుటుంబ సమస్యలు కూడా తీరిపోతాయి.
4.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెల బాగా కలిసొస్తుంది. బృహస్పతి, కుజుడు అనుకూలమైన కదలికలు ఆగస్టు నెలకు చాలా మేలు చేస్తాయి. ఈ సమయంలో కెరీర్ లో పురోగతి చూస్తారు. ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. వ్యాపారాల్లో బాగా రాణించగలరు. ఉమ్మడి వ్యాపారాలు లేదా కొత్త ప్రాజెక్టులలో విజయం సాధించవచ్చు.
మకర రాశి:
శని ఆధిపత్యం వహించే మకర రాశి వారు ఆగస్టులో తమ కృషికి మంచి ఫలితాలను చూస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు లేదా ఆస్తి సంబంధిత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
గమనిక: ఈ అంచనాలు సాధారణమైనవి. జ్యోతిష గ్రంథాలు , గ్రహాల కదలికలపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత జాతకాన్ని బట్టి వైవిధ్యాలు ఉండవచ్చు.