ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి అన్నిటా అనుకూలం, శుభవార్తా శ్రవణం
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు
పంచాంగం:
తేది : 16డిసెంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిరం
ఋతువు : హేమంత ఋతువు
పక్షం : కృష్ణపక్షం
వారము: శుక్రవారం
తిథి : అష్టమి రాత్రి 10:10 ని వరకు
నక్షత్రం :.ఉత్తర తెల్లవారుజామున05. 26 ని వరకు
వర్జ్యం: ఉదయం 11:30 ని ల01. 19 ని వరకు
దుర్ముహూర్తం:ఉ.08.37ని. నుండి ఉ.09.21ని. వరకు తిరిగి మ.12.16ని. నుండి మ.01.01ని. వరకు
రాహుకాలం:ఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
యమగండం: మ.3.00ని. నుండి సా.4.30ని. వరకు
సూర్యోదయం : ఉ.06.26ని.లకు
సూర్యాస్తమయం: సా.05.24ని.లకు
Vijaya Rama krishna
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
Zodiac Sign
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనవసరమైన ఆలోచనలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకుగా చికాకులు ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమ. చేయి పని వారితోటి కొద్దిపాటి ఇబ్బందులు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడను. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాయందు నిరాశ. మానసికంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధవహించవలెను. ఓం మంగళాదేవ్యై నమః అని 11సార్లు జపించింది శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు ఈరోజు ఓం షణ్ముఖాయ నమః అని11సార్లు చూపించండి శుభ ఫలితాలు పొందండి.
Zodiac Sign
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. ఓం సదాశివాయ నమః అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఓం హిరణ్మయై నమఃఅని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఓం విష్ణువే నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.శారీరక శ్రమ. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. మిత్రులతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఓం రవయేనమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. ఓం సదాశివాయ నమః అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం. ఓం కపర్థినే నమః అనే 11 జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఊహించిన విధంగా పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులుగా ఉండును. మానసికంగా బలహీనంగా ఉంటుంది . అనవసరమైన ఖర్చులు ఏర్పడవచ్చును.వృత్తి వ్యాపారంలో ఉందో కష్టానికి ప్రతిఫలం లభించును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారములు లభించును. సంతానమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు . మీ వంతు ఇతరులకు సహాయ సహకారాలు అందించండి. సంఘమునందు చేయ వ్యవహారములు తెలివిగా వ్యవహరించవలెను . ఈరోజు ఈ రాశి వారు ఓం విశ్వేశ్వరాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
కోపాన్ని అదుపులో ఉంచుకొని వలెను. వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఉద్యోగమునందు అధికారులు ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఈ రోజు ఈరాశి వారు ఓం కుమారాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ఫలిస్తాయి. ప్రియతముల ఆకస్మిక రాక ఆశ్చర్యానందాలు కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా కొత్తవిషయాలు గ్రహిస్తారు.దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.ఆరోగ్యంవిషయంలో జాగ్రత్త వహించాలి. ఓం కరుణాయైనమఃనమః అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
Zodiac Sign
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి పూర్తవుతాయి. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సాధిస్తారు. నూతన వ్యాపారాలు విషయాల గురించి ఆలోచన చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుందని. దేవాలయాలు సందర్శన చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంఘమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం పశుపతయే నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి