iphone 15 Price: వామ్మో ఐఫోన్ 15పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్? ఎక్కడ కొనాలంటే
iphone 15 Price: ఐఫోన్ వాడాలన్న కోరిక ఉందా? ఇదే మంచి సమయం ఆ ఫోన్ కొనేందుకు. ఐఫోన్ 15 పై ఏకంగా ముప్పయి వేల రూపాయల తగ్గింపు వస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని ఈ ఫోన్ ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 15 ధర ఎంత?
ఐఫోన్ కొనాలనేది ఎంతో మంది కల. కానీ దాని భారీ ధరలు చూసి కొనేందుకు వెనుకాడతారు. కానీ ఇప్పుడు మీరు కూడా ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. చాలా తక్కువ ధరకే భారీ డిస్కౌంట్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. సాధారణంగా ఈ ఫోన్ ధర రూ.52 వేల నుంచి మొదలవుతుంది. ఐఫోన్ ప్రో మ్యాక్స్ లక్ష రూపాయలకు పైమాటే ఉంది. అయితే ఇప్పుడు ప్రముఖ ఫోన్లు అమ్మే షోరూమ్ విజయ్ సేల్స్ భారీ ఆఫర్లను ప్రకటించింది. లాంచ్ ధర కన్నా రూ.30,885 తక్కువకే ఈ ఫోన్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లేదు.
డిస్కౌంట్ వివరాలు
ఈ డిస్కౌంట్లో భాగంగా ఐఫోన్ 15లోని 128GB, 256GB, 512GB వేరియంట్లన్నింటికీ వర్తిస్తుంది. రూ.79,900 లాంచ్ ధర ఉన్న బేస్ మోడల్‌ను విజయ్ సేల్స్ రూ.52,990కే అమ్ముతోంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డుపై 7.5% (రూ.3,975 వరకు) తక్షణ తగ్గింపు ఉంది. అన్ని ఆఫర్లు కలిపితే ఐఫోన్ 15 తుది ధర రూ.49,015 అవుతుంది.
డిస్‌ప్లే, పనితీరు ఫీచర్లు
ధర తక్కువైనా దీని నాణ్యతలో మాత్రం ఎలాంటి రాజీ లేదు. ఐఫోన్ 15 ఒక పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్. ఇది డైనమిక్ ఐలాండ్‌తో కూడిన 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. A16 బయోనిక్ చిప్‌సెట్‌తో వేగం, పనితీరులో అద్భుతంగా ఉంటుంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.
బ్యాటరీ, అదనపు ఫీచర్లు
ఐఫోన్ 15 ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీని కలిగి ఉంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న USB టైప్-సి పోర్ట్ ఇందులో ఉంది. ఇది MagSafe, Qi2, Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. క్రాష్ డిటెక్షన్, ఫేస్ ఐడి వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది iOS 17తో వచ్చినా, భవిష్యత్ అప్‌డేట్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది.

