- Home
- Astrology
- Shukra Transit: ఇప్పటినుంచి దీపావళి వరకు ఈ రాశులకు లక్ష్మీదేవి కటాక్షం, అంతా శుక్రుని వల్లే
Shukra Transit: ఇప్పటినుంచి దీపావళి వరకు ఈ రాశులకు లక్ష్మీదేవి కటాక్షం, అంతా శుక్రుని వల్లే
Shukra Transit: శుక్రుని వల్ల ఫిబ్రవరి నెల నుంచి ఈ ఏడాది దీపావళి పండగ వరకు కొన్ని రాశులకు విపరీతంగా కలిసి వస్తుంది. సంపదకు అధి దేవత అయిన లక్ష్మీదేవి తొమ్మిది నెలల పాటు ఈ రాశులు వారిపై చూపుతుంది. ఆ రాశుల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

దీపావళి వరకు శుక్రుని దయ
మకర రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల కొన్ని రాశులకు విపరీత రాజయోగం దక్కుతుంది. శుక్రుడు సంపదకు, శ్రేయస్సుకు, ప్రేమకు, అందానికి, ఆకర్షణకు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఫిబ్రవరి 1, 2020 శుక్రుని ఉదయం జరుగుతుంది. శుక్రుని పెరుగుదల అనేక రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ శుక్రుడు పెరగడం అనేది దీపావళి వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. అయితే దీపావళికి కొన్ని రోజుల ముందు శుక్రుడు మళ్ళీ అస్తమిస్తాడు. అంతకుముందే ఇక్కడ చెప్పిన నాలుగు రాశుల వారు ధనవంతులుగా మారుతారు.
వృషభ రాశి
వృషభ రాశిని పాలించేది శుక్రుడే. కాబట్టి శుక్రుని పెరుగుదల అనేది ఈ రాశిలో జన్మించిన వారికి ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. పెట్టిన పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. అలాగే వీరి జీతం కూడా పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి విపరీతమైన లాభాలు వస్తాయి. వీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. లేదా బంగారం, వెండి వంటి వాటిలో పెట్టుబడి పెడతారు.
మిథున రాశి
శుక్ర గ్రహం వల్ల మిథున రాశి వారికి జీవితం మంచి స్థితికి చేరుకుంటుంది. మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వీరికి పెద్ద ఒప్పందము లేదా ప్రాజెక్టు దక్కే అవకాశం ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం మాత్రం పెరుగుతుంది. పొదుపు కూడా బాగా చేస్తారు. ఇక ప్రేమ, అనుబంధాలలో ఆప్యాయతలు పెరుగుతాయి.
తులా రాశి
తులా రాశి వారిని పాలించేది శుక్ర గ్రహమే. కాబట్టి శుక్ర గ్రహం పెరుగుదల అనేది తులా రాశి వారికి అపారమైన ఫలితాలను కలిగిస్తుంది. గతంలో చేపట్టి నిలిచిపోయిన పనులు ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమయంలో మీ మనసులో ఉండిపోయిన ఒక కోరిక నెరవేరుతుంది. పెళ్లి కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మీన రాశి
మీన రాశి వారికి శని ప్రభావం ఎక్కువ. కానీ శుక్రుడు వల్ల వీరి కష్టాలు చాలా వరకు తగ్గుతాయి. వారి సంపద పెరుగుతుంది. అలాగే వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానానికి లేదా గౌరవాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అనుబంధాలు మరింత స్నేహపూర్వకంగా ఆనందంగా మారుతాయి.

