Zodiac signs: ఈ రాశులవారికి శత్రువులు చాలా ఎక్కువ, వీరు చేసే పనులే కారణం..!
Zodiac signs: జోతిష్య శాస్త్రంలో నాలుగు రాశులకు ఎక్కువ మంది శత్రువులు ఉంటారని చెబుతారు. మరి, ఆ రాశులు ఏంటి? వారికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారో తెలుసా?

zodiac signs
ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉండటం కామన్. స్నేహితులు లేనివాళ్లు ఉండరు. స్నేహితులు ఉన్నట్లే.. శత్రువులు కూడా ఉంటారు. కొందరికి తెలిసిన శత్రువులు ఉంటారు. కానీ కొందరికి తెలికుండానే శత్రువులు ఉంటారు. అయితే... జోతిష్యశాస్త్రంలో కొన్ని రాశుల వారికి శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారు. మరి, ఆ రాశులేంటో చూద్దామా....
1.మేష రాశి...
మేష రాశివారు చాలా నమ్మకంగా, ధైర్యంగా ఉంటారు. వీరు నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు. వీరిలో ఉన్న ఈ లక్షణం అందరికీ నచ్చదు. అంతేకాదు.. మేష రాశివారు.. తమ మనసులో ఏదీ ఉంచరు. అన్నీ బయటకు చెప్పేస్తూ ఉంటారు. ఇలా వీరు అన్నీ బయటకు చెప్పడం వల్ల చాలా మంది బాధపడతారు. ఫలితంగా ఈ రాశుల వారికి శత్రువులు పెరుగుతారు. అన్నీ ముఖం మీదే విషయాలను చెప్పడం అందరికీ నచ్చదు. ఫలితంగా తమ ప్రవర్తనతో శత్రువులను పెంచుకుంటారు.
2.సింహ రాశి....
సింహ రాశివారు చాలా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి ఓపిక చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ తామే కరెక్ట్ అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. తమకు సంబంధం లేకపోయినా అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా తమ విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం ఎదురు తిరిగి దాడి చేస్తారు. ఈ వ్యక్తిత్వం కారణంగా.. సింహ రాశివారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశివారికి ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఏదైనా చేయగలరు. వీరు కెరీర్ లో కూడా బాగా దూసుకుపోగలరు. అందుకే.. శత్రువులు కూడా పెరిగిపోతారు.
3.వృశ్చిక రాశి....
వృశ్చిక రాశి వారు విశ్రాంతి తీసుకోరు. అవిరామంగా పని చేస్తూ ఉంటారు. వారు ఏ పనిని అయినా గొప్ప అంకితభావంతో చేస్తారు. వారు తమ పని గురించి కూడా రహస్యంగా ఉంటారు. వారు తమ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ఏ స్థాయికి అయినా వెళ్ళగలరు. వృశ్చిక రాశి వారి ఈ లక్షణం కొన్నిసార్లు పరోక్షంగా శత్రువులు పెరుగుతారు. వృశ్చిక రాశి వారి వ్యక్తిగత పురోగతి , ప్రతిభ శత్రువుల సంఖ్యను పెంచుతుంది. వారికి స్నేహితుల రూపంలో కొంతమంది శత్రువులు ఉంటారు. స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో కూడా తెలుసుకోలేరు.
4.మకర రాశి
మకర రాశి వారు స్వతహాగా కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. క్రమ శిక్షణ చాలా ఎక్కువ. వారు సాధారణంగా విభేదాలు, వాదనలలో పాల్గొనడానికి ఇష్టపడరు. వారు శత్రువులను చేసే అవకాశాలను నివారించాలని కోరుకున్నప్పటికీ, పరిస్థితులు వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. మకర రాశివారు కోరుకోకపోయినా.. ఈ రాశివారికి శత్రువులు ఉంటారు. వీరు సాధించే విజయాలను చూసి కూడా శత్రువులు పెరుగుతారు.