Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి వయసు పెరుగుతుంటే... అందం కూడా పెరగడం పక్కా..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారిలో ఓ స్పెషల్ మ్యాజిక్ ఉంటుంది. వారు వయసు పెరుగుతున్నా కూడా యవ్వనంగా కనిపిస్తారు. వారిని చూస్తే ఎవరైనా ఇంప్రెస్ అయిపోతారు.

Birth Date
వయసు పెరుగుతుంటే వృద్ధాప్యం రావడం చాలా సహజం. రోజు రోజుకీ అందం తగ్గిపోతూ ఉంటుంది. కానీ... కొందరు అలా కాదు.. వయసు పెరుగుతున్నా వారిలో తేజస్సు పెరుగుతుంది. అందం, ఆకర్షణ కూడా పెరుగుతుంది. యవ్వనంగా, అందంగా కనిపించడమే కాదు... ఎల్లప్పుడూ ఉల్లాసంగా, శక్తివంతంగా కనిపిస్తారు. వాళ్లను చూస్తే ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే... వారిలో మాత్రం అది ఏ మాత్రం కనిపించడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని తేదీల్లో పుట్టిన వారు కూడా అంతే.. వయసు పెరిగినా కూడా యవ్వనంగా కనిపిస్తారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా.....
పుట్టిన తేదీ 2
ఏ నెలలో అయినా 2వ తేదీలో జన్మించిన వారిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఈ తేదీలో పుట్టిన వారిపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి మనసు చాలా గొప్పగా ఉంటుంది. మృదువైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఇతరులను చేసుకోవడంలో వీరికి సహజ ప్రతిభ ఉంటుంది. ఎవరినైనా కలిసినప్పుడు సౌకర్యంగా, భద్రంగా అనిపిస్తుంది. వీరు చూడటానికి అందంగా ఉంటారు..వీరి మనసు కూడా సంతోషంగా ఉంటుంది. వీరి రూపం చంద్రుడి లాగా ప్రకాశవంతంగా కనపడుతుంది. అందుకే.. వీరు వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు.
పుట్టిన తేదీ 12
ఏ నెలలో అయిన 12వ తేదీలో పుట్టిన వారు కూడా అందంగా, యవ్వనంగా కనిపిస్తారు. వీరిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. ఇది అదృష్టం, ఆశావాదాన్ని సూచిస్తుంది. ఈ తేదీల్లో జన్మించిన వారు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. కష్టాలు ఎదురైనా.. వెనకడుగు వేయరు. వయసుతో పాటు వీరి ఆలోచనలు మరింత విస్తృతమవుతాయి. కొత్త అనుభవాలను, కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని ఆస్వాదిస్తారు. అందుకే వీరి వ్యక్తిత్వం ఎల్లప్పుడూ ఉత్సాహభరితంగా, యవ్వనంగా ఉంటుంది.
పుట్టిన తేదీ 23...
ఏ నెలలో అయినా 23వ తేదీలో జన్మించిన వారిపై బుధుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తెలివితేటలు, చురుకుదనం, హాస్యాన్ని సూచిస్తుంది. ఈ రోజున పుట్టినవారు ఉల్లాసమైన స్వభావం, చమత్కారమైన మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వయసు పెరిగినా వీరి హాస్యం, ఆటపాటల పట్ల ఆసక్తి, విశాల దృక్పథం ఎప్పటికీ తగ్గదు. అందుకే వీరి వయసు తెలుసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. వీరి మానసిక చురుకుదనం వీరిని ఎప్పటికీ యవ్వనంగా ఉంచుతుంది.