జూన్ నెలలో ఈ రాశులవారికి కాసుల పంటే..!
ఈ రెండు యోగాలు ఒకేసారి రావడం వల్ల ఎక్కువగా ఉద్యోగాల్లో వారి స్థితి మారనుంది. జీతం పెరగనుంది. కోరికలు కూడా నెరవేరనున్నాయి. పనికి సంబంధంచిన ఏ ప్రయత్నం చేసినా ఫలితం రానుంది.
Horoscope June 2024
గ్రహాలు తరచూ మార్పులు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఈ నెలలో శుక్ర గ్రహం మార్పు సంతరించుకుంది. దీనిని మాళవ్య యోగం అంటారు. అదేవిధంగా శని దశ కూడా మార్పు చోటుచేసుకుంది. దీనిని మహా పురుష యోగం అని అంటారు. అయితే.. ఈ రెండు యోగాలు ఒకేసారి రావడం వల్ల జోతిష్యశాస్త్రం ప్రకారం... కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు జరగనున్నాయి. ఈ కింది రాశుల వారికి మాత్రం ఆర్థికంగా చాలా మంచి జరగనుంది.
ఈ రెండు యోగాలు ఒకేసారి రావడం వల్ల ఎక్కువగా ఉద్యోగాల్లో వారి స్థితి మారనుంది. జీతం పెరగనుంది. కోరికలు కూడా నెరవేరనున్నాయి. పనికి సంబంధంచిన ఏ ప్రయత్నం చేసినా ఫలితం రానుంది. వృత్తి, వ్యాపారాల్లో విపరీతమైన ఆదాయం పెరగనుంది. మరి ఏ రాశులకు ఈ అదృష్టం లభించనుందో చూద్దాం...
telugu astrology
1.సింహ రాశి..
10వ కేంద్రంలో శుక్రుడు సంచరించడం వల్ల మాళవ్య యోగం, 7వ కేంద్రంలో శని సంచారం సింహరాశికి చాలా బాగా కలిసి రానుంది. ఈ యోగాలు రాజకీయ ప్రభావాన్ని కలిగిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయం పెరుగుతుంది. మనసులోని కోరికలు, ఆకాంక్షలు నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగుల ప్రాముఖ్యత, ప్రభావం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం పొందే యోగం చాలా ఎక్కువగా ఉంది.
telugu astrology
2.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశికి నాల్గవ కేంద్రంగా శని సంచరించడంతో శష మహా పురుష యోగం ఉంది. ఏడవ ఇంట్లో శుక్రుడు సంచరించడం వల్ల మాళవ్య యోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాల వల్ల ఈ రాశి వారికి గృహ, వాహన యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ స్థితి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాల విషయంలో స్థిరత్వం ఉంటుంది. ధనిక కుటుంబంలో వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది.
telugu astrology
3.కుంభ రాశి..
కుంభరాశిలో శని సంచారం , చతుర్థ కేంద్రంలో శుక్రుని సంచారం వరుసగా షష , మాళవ్య మహా పురుష యోగాలను కలిగిస్తుంది. దీనివల్ల గృహయోగం కలుగుతుంది. ఆస్తి పెరుగుతుంది. ఆస్తి విలువ అంచనాలకు మించి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు సామరస్యంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విలాసవంతమైన జీవనం అలవాటు. పనిలో ప్రభావం పెరుగుతుంది. అధికార యోగం వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో బిజీ పరిస్థితి ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాసం ఉండే యోగం కూడా ఉంది.