- Home
- Astrology
- Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.. ఓసారి చెక్ చేసుకోండి.
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.. ఓసారి చెక్ చేసుకోండి.
న్యూమరాలజీని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. జ్యోతిష్య శాస్త్రానికి దగ్గరగా ఉండే ఈ వ్యవస్థపై కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఎంతో ప్రాముఖ్యత ఉంది. న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది.? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది.? లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ వివాహంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

పెళ్లి ప్రతీ జీవితంలో ఒక కీలక అంశం. అందుకే వివాహం సంబంధాల కోసం చూసే ప్రతీ ఒక్కరూ జాతకాన్ని చూస్తారు. జాతకాలు కలిస్తేనే వివాహం చేసుకునే వారు మనలో చాలా మంది ఉన్నారు. అయితే న్యూమరాలజీ మన వివాహాన్ని కూడా నిర్ణయిస్తుందని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కొన్ని తేదీల్లో జన్మించిన వారు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇంతకీ ఆ తేదీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా పుట్టిన తేదీల ఆధారంగా న్యూమరాలజీని నిర్ణయిస్తుంటారు. వీటిని రాడిక్స్ నెంబర్లుగా విభజిస్తుంటారు. రాడిక్స్ నెంబర్ 3,5,6లలో జన్మించిన వారు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రాడిక్స్ నెంబర్ 4,8లో జన్మించిన వారు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఏయే తేదీల్లో జన్మించిన వారు ఈ రాడిక్స్ నెంబర్ల కిందికి వస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
రాడిక్స్ నెంబర్ 3:
3,12, 21 తేదీల్లో జన్మించిన వారు రాడిక్స్ నెంబర్ 3 జాబితాలోకి వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు తమ జీవితాన్ని సంతోషంగా జీవించాలనే ఆలోచనతో ఉంటారు. తమ జీవితాన్ని వేరే వారు కంట్రోల్ చేయకూడదనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకునేందుకు మొగ్గు చూపుతారు.
Couple
రాడిక్స్ నెంబర్ 5:
5,14, 23 తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ నెంబర్ 5 కిందికి వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తమకు నచ్చిన వారితో జీవితాన్ని ఎంచుకోవాలని భావిస్తుంటారు.
రాడిక్స్ నెంబర్ 6:
6,15, 24 తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ నెంబర్ 6 జాబితాలోకి వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు ఇతరులను ఆకర్షిస్తారు. తమకు నచ్చిందే చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో తమ నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు:
రాడిక్స్ నెంబర్ 4:
13, 22, 31 వంటి తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ నెంబర్ 4 కింది వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు పెద్దలకు గౌరవం ఇస్తారు. వారి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకునేందుకు మొగ్గు చూపుతారు.
రాడిక్స్ నెంబర్ 8:
8, 17, 26 వంటి తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ నెంబర్ 8 కిందికి వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. వీరి దృష్టి అంతా కెరీర్ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఉంటుంది.
రాడిక్స్ నెంబర్‌ను ఎలా లెక్కించాలంటే.?
రాడిక్స్ నెంబర్‌ను లెక్కించడం చాలా సులభం. ఉదాహరణకు మీరు పుట్టిన తేదీ 13 అయితే మీ రాడిక్స్ నెంబర్ 4 అవుతుంది. అంటే మీ పుట్టిన తేదీలను యాడ్ చేస్తే వచ్చే నెంబర్ రాడిక్స్ నెంబర్ అవుతుందన్నమాట.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా లభించిన సమాచారం అలాగే పలువురు ప్రముఖులు తెలిపిన విషయాలను క్రోడీకరించి అందించడం జరిగింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.