Saturn Moon Conjunction: శని చంద్రుల కలయికతో విష యోగం.. ఈ రాశులవారు జాగ్రత్త
Saturn Moon Conjunction: జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 19న మీనరాశిలో శని, చంద్రుడు కలవబోతున్నారు. ఈ కలయిక వల్ల విష యోగం ఏర్పడి కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవు. ఈ రాశుల వారు కొన్నిరోజులు జాగ్రత్తగా ఉండాలి.

మేష రాశి
మేష రాశి వారికి శని, చంద్రుడి కలయిక పన్నెండవ పాదంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా పెరిగిపోతాయి. ఈ రాశి వారికి ఇష్టం లేని పనులు జరగడంతో జీవితంలో చికాకు పెరిగిపోతుంది. వీరి జీవితంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి వ్యాపారం చేసే చాలా జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి
మిథున రాశి వారు మార్చిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శని చంద్రుల కలయిక పదవ ఇంట్లో జరగబోతోంది. ఈ సమయంలో వీరికి వృత్తిపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో ఒత్తిడి పెరగుతుుంది. ఈ రాశి వారికి పై అధికారులతో విభేదాలు వస్తాయి. పనిభారం పెరిగినా, మీరు ఆశించిన ఫలితాలు రావు. ఈ సమయంలో విష్ణువును స్మరించుకోవడం మంచిది.
కర్కాటక రాశి
ఈ విష యోగం కర్కాటక రాశి వారి అదృష్ట స్థానంలో ఏర్పడుతుంది. దీనివల్ల మీకు అదృష్టం దక్కదు. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మరింత ఆలస్యమవుతాయి. లాభాలు ఏమీ దక్కవు. వీరికి నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఈ సమయంలో ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
తులా రాశి
శని చంద్రుడు వల్ల ఏర్పడే విష యోగం తులా రాశి వారి ఆరవ ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మానసిక ఒత్తిడి, అలసట ఎక్కువగా ఉంటాయి. పనిలో పోటీ వాతావరణం ఉంటుంది. ఇలాంటి సమయంలో, మీ జీవనశైలిని బ్యాలెన్స్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
మీన రాశి
మీన రాశిలోనే శని, చంద్రుల కలయిక జరుగుతుంది. ఈ సమయంలో ఏర్పడిన విష యోగం ప్రభావంతో ఈ రాశి వారికి భయాలు పెరిగిపోతాయి. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. బంధాల్లో కూడా విభేదాలు రావచ్చు. ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా, పదిసార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది.

