Zodiac signs: ఈ రాశుల వారితో మాట్లాడి ఎవరూ గెలవలేరు..!
Zodiac signs: కొన్ని రాశులవారిని మాటలతో గెలవలేము. వీరు ఏదైనా విషయంలో చర్చకు దిగితే, వారి ప్రత్యర్థులు పారిపోవాల్సిందే. వీరి మాటలకు ఎవరైనా భయపడిపోతారు.

Zodiac signs
ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడటం అందరి వల్ల కాదు. చాలా కొద్ది మాటలతో అందరినీ ఆకర్షిస్తారు. కొందరు అలా కాదు.. అడ్డదిడ్డంగా మాట్లాడేస్తారు. ముఖ్యంగా... ఎవరితో అయినా గొడవ పడుతున్నప్పుడు మరీ దారుణంగా మాట్లాడతారు. ఎంత సేపటికీ తాము మాట్లాడింది మాత్రమే కరెక్ట్ అన్నట్లుగా ప్రవర్తిస్తారు. వీరి మాటలకు ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే వాదిస్తూనే ఉంటారు. వీరి మాటల యుద్ధం తట్టుకోవడం ఎవరివల్లా కాదు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులేంటో చూద్దామా....
1.వృషభ రాశి...
వృషభ రాశివారు చాలా బాగా మాట్లాడగల నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు చాలా అర్థవంతంగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పడం, మోసం, ద్రోహం చేయడం వీరికి రాదు. ఏది మాట్లాడినా మనసులో నుంచే మాట్లాడతారు. ఈ రాశివారు పుట్టుకతోనే మంచి వక్తలు. ఎక్కడ ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి అనే విషయంలో వీరికి చాలా క్లారిటీ ఉంటుంది. వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఏ విషయం గురించినా అయినా వాదించగలరు. వీరి మాటల దాడి తట్టుకోవడం ఎవరి వల్లా కాదు. ముఖ్యంగా వీరి ప్రత్యర్థులు.. వీరి మాటల తూటాలకు తట్టుకోలేక ఇబ్బందిపడతారు. మాటల్లో వీరి మీద గెలవడం అసాధ్యం.
మకర రాశి...
మకర రాశివారు చాలా సహజంగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. వీరి దగ్గర చాలా సీక్రెట్స్ ఉంటాయి. వాదనల విషయానికి వస్తే.. వీరి ముందు ఎవరూ తట్టుకోలేరు. సరదా కోసం వీరు వాదనలు పెట్టుకోరు. ఈ రాశివారికి ప్రతి విషయంలో ఓ క్లారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరుల బలహీనతలను కూడా వెంటనే తెలుసుకుంటారు. కారణం లేకుండా ఈ రాశివారు ఇతరులతో వాదన పెట్టుకోరు. కానీ.. వీరు మాట్లాడటం మొదలుపెడితే... ఎదుటి వారికి నోటి నుంచి మాటలు రావు.
సింహ రాశి...
సింహ రాశివారు చాలా సరదాగా మాట్లాడగలరు. తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సంతోషంగా మార్చడానికి వీరు చాలా ఎక్కువగా ప్రయత్నిస్తారు. వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. నవ్వుతూ మాట్లాడుతూనే.. వీరు అందరికీ పోటీ ఇవ్వగలరు. వీరు మాట్లాడటం మొదలుపెడితే.. ఎలాంటి ప్రత్యర్థులు అయినా ఓడిపోవాల్సిందే.
తుల రాశి...
తుల రాశివారికి సహజంగానే కాస్త సహనం ఎక్కువ. కానీ, వీరు మాట్లాడటం మొదలుపెడితే తట్టుకోవడం ఎవరి వల్లా కాదు. వారు తమ వాదనలను చాలా గట్టిగా చెప్పగలరు. ఈ రాశివారితో ఏదైనా విషయంలో వాదించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. మాటల విషయంలో వీరితో ఎవరూ గెలవలేరు.
ధనుస్సు రాశి..
ధనుస్సు రాశివారికి తొందరగా ఎక్కువ. అందరితోనూ మాట్లాడగలరు. వీరికి ప్రతి విషయంలోనూ చాలా అవగాహన ఉంటుంది. తమకు తెలియకుండానే వీరు చర్చలో పాల్గొంటారు. వీరు ఏ విషయంలో అయినా విజయం సాధించాలని అనుకుంటారు. అందుకే ప్రతి విషయంలోనూ తల దూర్చి.. వాదిస్తూ ఉంటారు. ఎదుటి వారు తప్పులన్నీ తామే సరిదిద్దాలని అనుకుంటారు. దీని కోసం అవసరం లేని వాటిలో కూడా తలదూరుస్తారు. ఇక వీరి మాటలకు ఎదుటివారు సమాధానం చెప్పడం చాలా కష్టం.

