Saturn Mercury Conjuction: శని-బుధ కలయిక...ఈ మూడు రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు..!
Saturn Mercury Conjuction:వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడు, శని రెండూ 2026 లో కలవనున్నాయి. దీని కారణంగా, కొన్ని రాశుల వారు చాలా మంచి ఫలితాలను పొందుతారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

శని-బుధ సంయోగం...
జోతిష్యశాస్త్రంలో శని, బుధుడు చాలా ముఖ్యమైన గ్రహాలుగా పరిగణిస్తారు. శనిని న్యాయ దేవుడుగా పరిగణిస్తారు. బుధుడు ని జ్ఞానానికి సంకేతంగా భావిస్తారు. ఈ రెండింటితో అరుదైన కలయిక ఏర్పడనుంది. ఈ కలయిక 2026 లో మూడు రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది. ఇప్పటి వరకు ఈ రాశులవారు పడిన కష్టాలన్నీ తీరిపోతాయి.
మీన రాశి....
బుధుడు, శని కలయిక మీన రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీన రాశివారి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. స్నేహితులు పెరుగుతారు. ఈ సమయంలో మీ గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి వ్యక్తి దొరికే అవకాశం ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. కెరీర్, వ్యాపారంలో ఊహించని పురోగతి సాధిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు కూడా కనుగొంటారు.
వృషభ రాశి...
2026 బుధుడు, శని కలయిక వృషభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంయోగం ఈ రాశివారి 11వ ఇంట్లో లాభదాయక ఇంట్లో జరుగుతుంది. కాబట్టి, ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్, పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. మీ పిల్లల జీవితంలో మీరు ఊహించని పురోగతి పొందుతారు. మీ వృత్తి జీవితంలో మీ ప్రతిష్ఠ, ఖ్యాతి పెరుగుతుంది, వ్యాపారం చేయడానికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఊహించని స్నేహితులు లేదా బంధువుల ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
మకర రాశి...
మకర రాశి రెండో ఇంట్లో బుధుడు, శని కలయిక ఏర్పడుతుంది. ఇది మకర రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రచన, కమ్యూనికేషన్, మీడియా వంటి రంగాలలో వారికి ఇది చాలా మంచి సమయం. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. మీరు ఏ పని ధైర్యంగా చేసినా విజయం సాధించగలరు. కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వాహనం, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ కోరికలు, కలలు నెరవేరతాయి.

