Zodiac Signs: ఈ 4 రాశుల వారు మహా బద్ధకస్తులు, పనిచేసేందుకు ఏమాత్రం ఇష్టపడరు
Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు సోమరిపోతులుగా ఉంటారు. ఏ పనీ చేయడానికి ఇష్టపడరు. ఏ రాశి వారు ఇలా బద్దకస్తులుగా ఉంటారో తెలుసుకోండి.

వృషభ రాశి
వృషభ రాశి వారు ఇతర రాశులతో పోలిస్తే బద్ధకస్తులే. వీరు రోజువారీ ప్రయాణాలను ఏమాత్రం ఇష్టపడరు. అలాగే జీవితం ఏమార్పు లేకుండా సాగుతున్నా కూడా ఇష్టపడరు. వీరికి కష్టపడడం ఇష్టం ఉండదు. కష్టపడి పనిచేయాలనే కోరిక తక్కవగా ఉంటుంది. ఏ పనీ చేయకుండానే భోగభాగ్యాలతో, విలావవంతంగా జీవించాలని కోరుకుంటారు.
సింహ రాశి
సింహ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. అందరి దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటారు. వీరు సృజనాత్మకంగా ఉండేందుకు ఇష్టపడతారు. కానీ కష్టపడి పనిచేయడమంటే మాత్రం వీరికి ఇష్టం ఉండదు. అలా అని వీరికేమీ రాదని చెప్పలేం… వీరిలో ప్రతిభ అధికంగానే ఉంటుంది. చూసేందుకు ఆకర్షణీయంగా కూడా ఉంటారు. కానీ సోమరితనం వల్ల వెనుకబడుతూ ఉంటారు. సోమరితనం లేకుంటే వీరు చాలా లక్కీ. కచ్చితంగా విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి బద్ధకం ఎక్కువగానే ఉంటుంది. వీరికి పరిమితులు, హద్ధులు పెట్టడం ఏమాత్రం ఇష్టపడరు. స్వేచ్ఛగా తమ పని తాము చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. వీరికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక అధికం. ప్రయాణాలు చేయడానికి, స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. తమ ప్రయాణానికి ఎంత డబ్బు అవసరమో దాని కోసం మాత్రమే పని చేస్తారు. కానీ ఆఫీసులో ముందుండాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మాత్రం ఉండదు. దానికి కారణం బద్ధకం.
కుంభ రాశి
కుంభ రాశి వారికి కొంచెం బద్ధకం ఎక్కువే. వీరికి కలలు, ఆశయాలు పెద్దగానే ఉంటాయి. కానీ వాటిని సాధించాలంటే కష్టపడాలి. అలా కష్టపడాలంటే మాత్రం వీరికి ఇష్టం ఉండదు. పని చేసే ప్రణాళిక తెలిసినా కూడా పనిచేయరు. వీరికి తెలివైనవారే కానీ… పనిచేసేందుకు ఇష్టపడరు. అనుకున్న లక్ష్యం కోసం పనిచేయాలంటే వీరికి మహా బద్ధకం. అందుకే మధ్యలోనే పనిని వదిలేస్తారు.