Zodiac Signs: అదృష్టమంతా ఈ మూడు రాశులదే, డిసెంబర్ వరకు వీరికి బీభత్సంగా కలిసివస్తుంది
Zodiac Signs: అంగారకుండా సంచారం కొన్ని రాశుల వారికి ఎన్నో లాభాలు తెచ్చిపెడుతుంది. వృశ్చిక రాశిలో త్వరలో అంగారకుడి వల్ల రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం డిసెంబర్ 7 వరకు ఉంటుంది. ఇది మూడు రాశులవారికి అత్యంత కలిసొచ్చే కాలం.

అంగారకుడి వల్ల యోగం
గ్రహాలలో అంగారకుడు ముఖ్యమైనవాడు. అతడు ఉచ్ఛ స్థితిలో ఉంటే కొన్ని రాశుల వారికి అద్భుతంగా జరుగుతుంది. అదే నీచ స్థితిలో ఉంటే మాత్రం కష్టాలు తప్పవు. అయితే ఇప్పుడు అంగారకుడు కన్యారాశిలో ఉన్నాడు. అక్టోబర్ 27, 2025న తన సొంత రాశి అయిన వృశ్చికంలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడే డిసెంబర్ 7 వరకు ఉండబోతున్నాడు. అంగారకుడి వల్ల 'రుచక యోగం' ఏర్పడుతుంది. ఈ రాజయోగాన్ని ఎంతో ముఖ్యమైనదిగా చెబుతారు. పంచ మహాపురుష యోగాలలో ఇది ఒకటిగా చెప్పుకుంటారు. ఈ యోగం వల్ల మూడు రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది.
వృశ్చిక రాశి
అంగారకుడి సొంత రాశి వృశ్చిక రాశి. కాబట్టి ఈ రుచక రాజయోగం వారికి ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు దొరుకుతాయి. రియల్ ఎస్టేట్‌లో లో ఉన్నవారికి ఆర్ధికంగా విజయం సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఇతరులతో కలిసి చేసే పనులు లాభాలు తెచ్చిపెడతాయి. కోర్టు కేసులు గెలిచితీరుతారు. ఆర్ధికంగా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది.
మకర రాశి
అంగారక సంచారం అనేది మకర రాశి వారికి బీభత్సంగా కలిసిరాబోతోంది. మకర రాశి వారికి రుచక రాజయోగం అన్నివిధాలుగా మేలే చేస్తుంది. మీ జీవితంలో అన్నీ సానుకూల ఫలితాలే కలుగుతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసివస్తుంది. ఈ రాశి వారి ఉద్యోగులకు ప్రమోషన్, జీతం వంటివి పెరిగే అవకాశం ఉంది. ఇక కొత్తగా పెళ్లయిన జంటలకు సంతాన యోగం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం కచ్చితంగా వస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారు రుచక రాజయోగంగా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మీరు అనుకుంటున్న పనులు త్వరగా చేయగలుగుతారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మీకు ఎన్నో సుఖాలు దకకుతాయి. మీకు ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం కూడ కనిపిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతాయి. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ దక్కుతుంది. జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.