Amavasya: ఈ ఏడాది చివరి అమావాస్య.. ఈ రాశులవారికి జీవితమే మారిపోతుంది
Amavasya: ఈ ఏడాది చివరి అమావాస్య డిసెంబర్ 20న తెల్లవారుజామున 3:43 గంటలకు వస్తుంది. ఆ అమావాస్య కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. వారి జీవితమే మారిపోతుంది. ఏ రాశి వారికి ఈ అమావాస్య నుంచి కలిసివస్తుందో తెలుసుకోండి.

సింహ రాశి
ఈ ఏడాది చివరిలో వచ్చే అమావాస్య కొన్ని రాశుల వారికి బీభత్సంగా కలిసివస్తుంది. అందులో సింహ రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి ఈ అమావాస్య కష్టాలను తగ్గిస్తుంది. జీవితంలో పాజిటివిటీపై నమ్మకాన్ని తిరిగి నిలబెడుతుంది. ఈ రాశి వారుఅందరి దృష్టిని ఆకర్షిస్తారు. అందరికీ నచ్చుతారు. వీరికి అలసట తగ్గి…ఆనందం కలుగుతుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ చివరి అమావాస్య ఎంతో కలిసివస్తుంది. చాలా కాలంగా మధ్యలోనే నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. మీ పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇది వారికి గుర్తుండిపోయే క్షణాలను ఎన్నో అందిస్తుంది. వీరికి అన్ని రకాలుగా కలిసివస్తుంది.
ధనూ రాశి
ధనుస్సు రాశి వారు ఇంతవరకు ఎంతో ఓపికగా ఉండాల్సిన కాలం సాగింది. ఇప్పుడు ఆ ఓర్పుకు తగిన ఫలితం దక్కే సమయం వచ్చింది. ఈ అమావాస్య వారి మానసిక స్థితి, పరిస్థితులు, అంతర్గత భావనలలో ఎంతో మంచి మార్పులను తీసుకువస్తుంది. వారి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ అమావాస్య బాగా కలిసివస్తుంది. ఈ రాశి వారికి రెట్టింపు ఆనందం దక్కుతుంది. వీరు ఊహించని బహుమతులు లేదా సంతోషాన్నిచ్చే సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు వీరికి అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ అమావాస్య నుంచి ఊహించని ఘటనలు జరుగుతాయి. అవన్నీ కూడా వారికే మేలే చేస్తాయి. వీరికి కొత్త వార్తలు అందే అవకాశం ఉంది. వీరి మానసిక స్థితిలో ఎన్నో మార్పులు వస్తాయి. అవన్నీ సానుకూల మార్పులుగా చెప్పుకోవాలి.

