- Home
- Astrology
- Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ 17 డిసెంబర్: మీనాకి సవతిని తెచ్చి... సత్యం, ప్రభావతిలను కలిపిన బాలు, అదిరిపోయే ఎపిసోడ్
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ 17 డిసెంబర్: మీనాకి సవతిని తెచ్చి... సత్యం, ప్రభావతిలను కలిపిన బాలు, అదిరిపోయే ఎపిసోడ్
Gunde Ninda Gudi Gantalu Today సత్యం, ప్రభావతి లను ఎవరు ఎంత ప్రయత్నించినా కలవడం లేదు. సుశీలమ్మ దోశల ట్రిక్ వాడినా కూడా సత్యం కరగలేదు. మరి, ఈ రోజు బాలు వారిని ఎలా కలుపుతాడో , టీవీ కంటే ముందే చూసేద్దాం...

గుండె నిండా గుడి గంటలు
మనోజ్ తన షోరూమ్ కి వెళతాడు. అక్కడ.. తనకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోందని దేవుడి దగ్గర మోర పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి లెటర్ ఇచ్చి వెళతాడు. ఆ లెటర్ లో రాసి ఉన్నది చూసి షాక్ అవుతాడు. అప్పుడే షోరూమ్ కి వచ్చిన రోహిణి కూడా చూపిస్తాడు. ‘ చుట్టూ ఉన్నవాళ్ల వల్లే సమస్యలు వస్తాయి’ అని లెటర్ లో ఉండటం విశేషం. లెటర్ ఎవరు ఇచ్చారు అని రోహిణి అంటే... తెలీదని మనోజ్ చెబుతాడు. ‘ చుట్టూ ఉన్న వాళ్లు ఎవరూ’ అని ఆలోచిస్తుంటే.... ‘ బాలు, మీనా అయ్యి ఉంటారు’ అని రోహిణీ అంటే... మనోజ్ మాత్రం.. రోహిణి ఫ్రెండ్ పై డౌట్ పడతాడు. ఆమె వెంటనే.. తాను మీకు మంచి చేసే వ్యక్తి అని చెబుతుంది. కాసేపు దీని గురించే వీళ్లు చర్చించుకుంటారు. ఎవరో కావాలని తనతో ఇలా చేస్తున్నారని మనోజ్ అనుకుంటూ ఉంటాడు. ఈ లోగా షాప్ లో పనిచేసే కుర్రాళ్లు నవ్వుకుంటూ ఉంటే.. తనని చూసే నవ్వుతున్నారని మనోజ్ బాగా హర్ట్ అవుతాడు. రోహిణి వచ్చి నచ్చ చెబుతోంది. టెన్షన్ పడుతున్న మనోజ్ కి ధైర్యం చెబుతుంది. ఈ లెటర్ వెనక రోహిణి మాజీ భర్త దినేష్ ఉన్నాడేమో , లేక కల్పన ఉందేమో అని రోహిణి తన ఫ్రెండ్ తో చర్చిస్తుంది.
రెండో పెళ్లాన్ని ఇంటికి తెచ్చిన బాలు
సీన్ కట్ చేస్తే... బాలు కొత్త కారు కొని ఇంటికి తీసుకువస్తాడు. అదే విషయాన్ని మీనాకి ఫోన్ చేసి చెబుతాడు. డైరెక్ట్ గా కారు అని చెప్పకుండా.. రెండో పెళ్లాన్ని తీసుకువచ్చానని చెబుతూ... ఇంట్లో ఉన్న అందరినీ తీసుకొచ్చి హారతి ఇవ్వమని చెబుతాడు. మీనాకి విషయం అర్థమైనా నవ్వుకుంటూ... హారతి తీసుకువస్తాను అని చెబుతుంది. అయితే... ఏడిపిద్దామన్నా కూడా వర్కౌట్ కాలేదు అని బాలు ఫీలౌతాడు
ఇక హాల్లో సత్యం తన తల్లితో మాట్లాడుతూ ఉంటాడు. కొద్ది రోజులు నీతో పాటు ఊరికి వస్తాను అని సత్యం అంటే.. నీతో పాటు ప్రభావతిని కూడా తీసుకొని రా అని సుశీలమ్మ అంటుంది. అయితే ప్రభావతి మాత్రం తనకు డ్యాన్స్ క్లాస్ ఉందని చెబితే... అక్కడికి ఈగలు కూడా రావడం లేదని సత్యం సెటైర్ వేస్తాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటుండగా... మీనా వచ్చి బాలు బయటకు రమ్మని చెప్పాడని.. రెండో కారు తెచ్చాడు అని చెబుతుంది. దీంతో... వీళ్లు బయటకు వస్తారు. రవి, శ్రుతిని కూడా రమ్మని మీనా చెబుతుంది. హారతి తీసుకువస్తాను అని మీనా అంటే... మీ అత్త దిష్టి తగలకుండా నిమ్మకాయ కూడా తెమ్మని సుశీలమ్మ చెబుతుంది. ప్రభావతి మాత్రం తన బుద్ధి పోనిచ్చుకోదు.. అంతోటి కారుకీ అని వెటకారంగా మాట్లాడుతుంది.
కొత్త కారులో షికారు...
ఇక... కారుని చూసి చాలా బాగుందని ఇంట్లో అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఈ లోగా మీనా హారతి తెచ్చి కారుకి హారతి ఇస్తుంది. ‘ ఏయ్ పూల గంప ఎలా ఉంది? మన రెండో సొంత కారు’ అని బాలు అడిగితే.. ‘ రోహిణీ ఇచ్చిన డబ్బులతో కొన్నదేగా’ అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. వెంటనే రవి.. ‘ అంటే నువ్వు, మనోజ్ మింగినవేగా’ అని కౌంటర్ వేస్తాడు. ఆ మాటకు ఇంట్లో అందరూ నవ్వేస్తారు. ఇక.. బాలు జీవితంలో మంచిగా ఎదుగుతున్నందుకు.. సుశీలమ్మ సంతోషిస్తుంది. ‘ వాడికి మీనా తో పాటే అదృష్టం కలిసొచ్చింది’ అని సత్యం అంటే...‘ మరి అమ్మతో నీకు ఎందుకు అదృష్టం కలిసి రాలేదు నాన్న’ అని రవి అడుగుతాడు. దానికి ప్రభావతి ఉడుక్కుంటూ.. ‘ అదృష్టం కలిసొస్తే కారు కాదురా.. బస్సు కొనేవాడు’ అని చెబుతుంది. అందరూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు.
ఒక్కటైన సత్యం, ప్రభావతి
బాలు.. కారు కీని వాళ్ల నానమ్మని ఇవ్వమని అడిగితే... ‘ అదృష్ట దేవతను పక్కన పెట్టుకొని నేను ఎందుకు రా’ అని సుశీలమ్మ అంటుంది. ‘ నాకు తెలుసు అత్తయ్య గారు.. వాడి అదృష్ట దేవతను నేనే కదా’ అని అంటుంది. ‘ కాదు.. మీనా.. నీ చేతితో బాలుకి కారు కీ ఇవ్వమని ’ చెబుతుంది. అయితే మీనా అత్తయ్య గారి తో ఇప్పించమని మీనా మంచి మనసుతో అన్నా.. వద్దులే నువ్వే ఇవ్వు అని ప్రభావతి వెటకారం చేస్తుంది. తర్వాత.. కొత్త కారులో అమ్మ, నాన్నలను గుడికి తీసుకువెళ్లమని సుశీల చెబుతుంది. ఈ వంకతో సత్యం, ప్రభావతి లను కలపాలని సుశీలమ్మ ప్లాన్ వేస్తుంది. అదే విషయం బాలుకి మీనా.. శ్రుతి కి రవి చెబుతారు.
ఇక.. కారులో వెళ్తున్నప్పుడు బాలు రోడ్లు బాలేవు అని వంక పెట్టి... అడ్డదిడ్డంగా కారు నడుపుతాడు. ప్రభావతి కూర్చోలేక పడిపోతూ ఉంటుంది. ఆమె ఇబ్బంది పడుతోందని.. తన చేతిని పట్టుకొని సత్యం చెబుతాడు. అలా వాళ్లు.. కలిసిపోతారు. అది చూసి బాలు, మీనా నవ్వుకుంటూ ఉంటారు.
ఇంట్లో సుశీలమ్మతో శ్రుతి మాట్లాడుతూ ఉంటుంది. గతంలో సుశీలమ్మ పుట్టిన రోజు నాటి విశేషాలను మాట్లాడుకుంటూ ఉంటుంది. మాటలో మాటగా... రవి చిన్నప్పటి ఫోటోలను సుశీలమ్మ చూపిస్తుంది. అవి చూసి... రవిని శ్రుతి ఏడిపిస్తుంది. వీళ్లు ఆడుకుంటున్న సమయంలోనే బాలు, మీనా గుడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. వాళ్ల వెనక సత్యం, ప్రభావతి చక్కగా నవ్వుకుంటూ రావడం చూసి, వాళ్లు మాట్లాడుకోవడం చూసి షాక్ అవుతారు. బామ్మ ప్లాన్ వల్ల వీరు కలిసిపోయారని అందరూ సుశీలమ్మను మెచ్చుకుంటారు. ఈలోగా... ప్రభావతి ముఖం మీద ఉండాల్సిన బొట్టు.. సత్యం మెడకు అంటుకుంటుంది. అది చూసి అందరూ.. గుడికి వెళ్లారా? పార్క్ కి వెళ్లారా అని అంటారు. ప్రభావతి సిగ్గుపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

