MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టిన వారికి తిరుగులేదు, పేరు, డబ్బు వాటంతట అవే వస్తాయి

Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టిన వారికి తిరుగులేదు, పేరు, డబ్బు వాటంతట అవే వస్తాయి

న్యూమరాలజీ ప్రకారం  కొన్ని ప్రత్యేక తేదీలు ఉంటాయి. ఆ ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారికి స్పెషల్ పవర్స్ కూడా ఉంటాయి. ఆ స్పెషల్ తేదీల్లో పుట్టిన వారికి పుట్టుకతోనే డబ్బు, ఫేమ్ రెండూ వచ్చేస్తాయి. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...    

2 Min read
Author : ramya Sridhar
Published : May 17 2025, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

జోతిష్యశాస్త్రం లాగానే.. న్యూమరాలజీ ప్రకారం కూడా మనం మన భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. ఈ విషయాలు తెలుసుకోవడానికి మనకు కొన్ని సంఖ్యలు మాత్రమే అవసరం. ఈ సంఖ్యలను 1 నుంచి 9 వరకు ఉన్న మూల సంఖ్యలు అని అంటారు. ఈ తొమ్మిది నెంబర్లు... తొమ్మిది గ్రహాలకు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. మనం పుట్టిన తేదీని బట్టి.. ఈ నెంబర్ ని తెలుసుకోవచ్చు. ఆ నెంబర్ ఆధారంగా వ్యక్తుల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.  కాగా, ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం మూడు తేదీల్లో పుట్టిన వారికి జీవితంలో డబ్బు, సక్సెస్ అన్నీ పెద్దగా కష్టపడకుండానే వచ్చేస్తాయి.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నెంబర్ 1..

న్యూమరాలజీ ప్రకారం  ఏ నెలలో అయినా 1, 10, 19, 18 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకే వస్తారు.  ఈ నెంబర్ సూర్యుడికి సంకేతం గా భావిస్తారు. ఈ నెంబర్ కి సంఖ్యాశాస్త్రంలో ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టినవారిపై సూర్యుడి శక్తి, ఆత్మ విశ్వాసం, స్ఫూర్తిని నింపుతాడు.ఈ సంఖ్యకి సంబంధించిన తేదీల్లో జన్మించిన వారు స్వతంత్రంగా ఉంటారు. వారి నాయకత్వ సామర్థ్యం అద్భుతం. వారు లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగుతారు. వీరికి జీవితంలో డబ్బు, ఫేమ్ చాలా తొందరగా వస్తాయి. 
 

34

మూల సంఖ్య 4

ఏ నెలలో అయినా 4, 13, 22 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య నెంబర్ 4 కిందకు వస్తుంది. ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ తేదీల్లో  పుట్టిన వారు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. తీసుకున్న ప్రతి బాధ్యతను చాలా చక్కగా నిర్వహిస్తారు.వీరు చాలా నిజాయితీపరులు. చాలా నమ్మకంగా కూడా ఉంటారు. ప్రతి నిమిషం తమ కర్తవ్యానికి కట్టుబడి ఉంటారు. వారు సెక్యూర్డ్ లైఫ్ లో జీవితం సాగించాలని అనుకుంటారు. తమ భద్రతతో పాటు.. ఇతరులను భద్రతను కూడా చూసుకుంటారు.

 

44

మూల సంఖ్య 8
నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు నెంబర్ 8 కిందకు వస్తారు.  ఇది సంఖ్యాశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన సంఖ్యల్లో ఒకటి. శక్తి, సమృద్ధికి చిహ్నమైన ఈ సంఖ్య వ్యక్తికి ఐశ్వర్యం, సంపద, భౌతిక సుఖాలను అందిస్తుంది. ఈ సంఖ్యకి సంబంధించిన వ్యక్తులు జీవితంలో చాలా విజయం సాధిస్తారు. వారు ఆర్థికంగా బలంగా ఉంటారు. వారి నాయకత్వ లక్షణాలు అద్భుతం. వారు తమ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. 8వ సంఖ్య శని సంఖ్య, దాని శక్తి వారు ఎత్తైన స్థాయికి చేరుకోవడానికి సహాయపడుతుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరికీ భయపడరు..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమించినవారినే మోసం చేస్తారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved