- Home
- Astrology
- Five Planet Conjunction: ఒకే రాశిలో 5 గ్రహాల కలయిక, ఈ 3 రాశుల అదృష్టాన్ని ఆపడం ఎవరితరం కాదు
Five Planet Conjunction: ఒకే రాశిలో 5 గ్రహాల కలయిక, ఈ 3 రాశుల అదృష్టాన్ని ఆపడం ఎవరితరం కాదు
Five Planet Conjunction: వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. జనవరిలో ఐదు గ్రహాలు ఒకేసారి మకరరాశిలో కలవబోతున్నాయి. దీనివల్ల మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

పంచగ్రహ యోగం
జనవరి 2026లో అరుదైన యోగం ఏర్పడబోతోంది. ఒకే రాశిలో అయిదుగ్రహాలు సంచరించబోతున్నాయి. అందుకే దీన్ని పంచగ్రహ యోగం అని పిలుస్తారు. వేద జ్యోతిషం చెబుతున్న ప్రకారం సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు.. ఒకేసారి మకరరాశిలో చేరబోతున్నారు. వారు పంచగ్రహ యోగాన్ని సృష్టిస్తారు. జనవరి 24న ఈ యోగం ఏర్పడుతుంది. అంతవరకు మకరరాశిలో నాలుగు గ్రహాలు ఉంటాయి. కానీ జనవరి 24న బుధుడు ఈ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల ఈ శుభ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అధికంగా కలిసి వచ్చేలా చేస్తుంది. అందులో మూడు రాశులు ముఖ్యమైనది. ఇందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి.
మకర రాశి
మకరరాశిలోనే ఈ పంచగ్రహ యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ శుభ యోగం మకర రాశి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పనిచేసే చోట వీరికి అన్ని రకాలుగా కలిసివస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఇక వ్యాపారం రంగంలో ఉన్నవారికి ముఖ్యమైన ఒప్పందం వస్తుంది. దీని వల్ల అధిక లాభాలు పొందే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా పంచగ్రహ యోగం బాగా కలిసివస్తుంది. ఈ రాశి వారు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వీరికి కెరీర్ లో లాభాలు కనిపిస్తాయి. కెరీర్‌లో ముందుకు సాగే అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేసే చోట పై అధికారుల సపోర్టు వీరికి దక్కుతుంది. ఆస్తులు కొనేందుకు ఇది మంచి సమమయం. భూమి కొనడం, ఆస్తిలో పెట్టుబడి వంటివి కలిసి వస్తాయి.
మీన రాశి
మీన రాశి వారికి పంచగ్రహ యోగం వల్ల మంచి జరుగుతుంది. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వీరికి అనేక కొత్త మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. వీరి జీవితంలో సానుకూల మార్పులు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. భవిష్యత్తు కోసం వీరు వేసుకున్న ప్లాన్లు విజయవంతం అవుతాయి.

