Zodiac signs: కుంభ రాశిలోకి చంద్రుడు.. ఈ మూడు రాశులకు టెన్షన్ తప్పదు..!
Zodiac signs: చంద్రుడు నవంబర్ 28న తన రాశిని మార్చుకోబోతున్నాడు. మకర రాశి నుంచి కుంభ రాశిలోకి అడుగుపెడతాడు. దీని కారణంగా కొన్ని రాశులకు అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Zodiac signs
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తరచుగా తమ దిశ మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పు శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఈ యోగాలు వ్యక్తిగత జీవితం, ఉద్యోగం వంటి విషయాలపై ప్రభావం చూపుతాయి. కాగా.. ఈ నెలాఖరుకు చంద్రుడు మకర రాశిని వదిలేసి రాహువుకు చెందిన రాశి అయిన కుంభ రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీని కారణంగా మూడు రాశులకు అనుకోని సమస్యలు వస్తాయి. ఎక్కడా లేని టెన్షన్ మొత్తం భరించాల్సి వస్తుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా....
సింహ రాశి....
చంద్రుడు రాశి మార్పు... సింహ రాశివారికి అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుకే, ఈ సమయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాటి కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇది మీకు చాలా చిరాకు కలిగించవచ్చు. ఇక, మీ ప్రత్యర్థులు చాలా చురుకుగా ఉంటారు. మిమ్మల్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంటారు. ఈ సమయంలో, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. పెట్టుబడులు పెట్టేటప్పుడు తెలివిగా వ్యవహరించండి. అజాగ్రత్తతో ఎలాంటి పనులు చేయకూడదు.
తుల రాశి...
చంద్రుడి రాశి మార్పు.... తుల రాశివారికి అనేక సమస్యలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రాశివారు ఇతరుల ప్రలోభాలకు లోను కాగండి. తక్షణ లాభం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు. దీని వల్ల ఎక్కువగా నష్టపోతారు. ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. పరీక్షలకు సంబంధించిన విద్యార్థులకు ఈ సమయంలో ఓపిక చాలా అవసరం. వ్యాపారాల్లో కూడా నష్టాలు రావచ్చు. ఈ నష్టాలు తగ్గడానికి ఓపిక చాలా అవసరం.
మీన రాశి...
మీన రాశివారు ఈ సమయంలో ఒంటరిగా ఉన్నామనే భావనలో ఉంటారు. అసంపూర్తిగా ఆగిపోయిన పనులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. తోటి ఉద్యోగులతో అపార్థాలు చోటుచేసుకోవచ్చు. మీ తప్పులను ప్రత్యర్థులు తమకు అనుకూలంగా వాడుకునే ప్రమాదం ఉంది. భాగస్వామితో కూడా గొడవలు రావచ్చు. అపార్థాలు రాకుండా ఉండేందుకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా తగ్గే అవకాశం ఉంది.

