Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026లో బాగా కలిసొస్తుంది..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారికి 2026 చాలా బాగా కలిసిరానుంది. ముఖ్యంగా వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...

నెంబర్ 1..
ఏ నెలలో అయినా 1, 10,19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారికి 2026 స్వర్ణయుగం కానుంది. వీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే, ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. మీ ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. మీ భాగస్వామితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఓర్పు, ప్రశాంతతో మీరు ఎలాంటి సమస్య అయినా పరిష్కరించగలరు.
నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026 చాలా అద్భుతంగా ఉండనుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి సాధించగలరు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. డబ్బు విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి.. వచ్చే ఆదాయాన్నీ, ఖర్చులను కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు. తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది.
నెంబర్ 5...
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. దీని కారణంగా ఈ రాశివారి కెరీర్ అద్భుతంగా మారుతుంది. వ్యాపారాల్లో బాగా రాణించగలరు. డిజిటల్, మీడియా రంగానికి చెందిన వారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ ఏడాది లాభాలు బాగా వస్తాయి. ఇది మీ ఆనందాన్ని మరింత పెంచుతుంది.
నెంబర్ 9...
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి కూడా 2026 బాగా కలిసొస్తుంది. ధైర్యం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి సాధించగలరు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఊహించని లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి కుజుడు అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా వీరికి ఈ సమయంలో అనుకున్నవన్నీ సాధించగలుగుతారు.